రాత్రి భోజనంలో ఇవొద్దు! లేనిపోని తిప్పలు వస్తాయ్..

20 September 2024

TV9 Telugu

TV9 Telugu

చాలామంది తెలిసో తెలియకో రాత్రి భోజనం విషయంలో కొన్ని తప్పులు చేస్తుంటారు. ఈ విధమైన తప్పులు ఆరోగ్యానికి తీవ్ర హాని తలపెడతాయి. ఇలాంటి అలవాట్లను దూరం చేసుకోవడం ఎంతో ముఖ్యమంటున్నారు నిపుణులు

TV9 Telugu

రాత్రి భోజనంలో ఇష్టం కదా మటన్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్ వంటి ఘాటైన ఆహారాలు తీసుకోవద్దు. బదులుగా ఆరోగ్యానికి మేలు చేసేఏ పౌష్టికాహారంపై దృష్టి పెట్టాలి. శరీరంలోని పోషకాల లోపాన్ని భర్తీ చేసే ఆహారాలను మాత్రమే రాత్రి సమయంలో తినడం అలవాటు చేసుకోవాలి

TV9 Telugu

బరువును అదుపులో ఉంచే ఆహారాలను రాత్రి భోజనంలో ఉండేలా చూసుకోవాలి. కాబట్టి రాత్రిపూట ఇలాంటి ఆహారాలను తెలుసుకోవడం ద్వారా జీర్ణ సమస్యలను దూరం చేసుకోవచ్చు

TV9 Telugu

ముఖ్యంగా రాత్రి భోజనం తర్వాత చాక్లెట్, ఐస్ క్రీం వంటివి తినవద్దు. అవి ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్‌ను ఉత్పత్తి చేస్తాయి. వీటిని తినడం వల్ల నిద్ర సమస్యలు తలెత్తుతాయి

TV9 Telugu

రాత్రి మేలుకుని ఉండటానికి కాఫీ తాగుతుంటారు కొంతమంది. ఇందులో కెఫిన్ ఉంటుంది.ఇది నిద్రలేమి. డీహైడ్రేషన్‌కు కారణమవుతుంది. కాబట్టి దీనిని తీసుకోకపోవడమే మంచిది

TV9 Telugu

రాత్రి భోజనంలో పచ్చి ఉల్లిపాయలు తినకూడదు. ఇది జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. గ్యాస్‌తో కడుపు ఉబ్బిపోయి ఇబ్బంది కలిగిస్తుంది. అలాగే రాత్రి భోజనంతో స్వీట్లు తినకూడదు

TV9 Telugu

రాత్రి భోజనంలో చక్కెరతో చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల బరువు పెరగడం, షుగర్ స్థాయిలు పెరగడం జరుగుతాయి

TV9 Telugu

రాత్రిపూట స్పైసీ ఫుడ్‌కు దూరంగా ఉండండి. అదనపు ఉప్పు ఆహారాలు మీ జీవక్రియను పెంచడంలో సహాయపడతాయి. కానీ ఇది కడుపు సమస్యలను కూడా పెంచుతుంది