రెండు ద్వీపాల మధ్య దూరం 3కి.మీ.. చేరుకోవాలంటే 21గంటలు
TV9 Telugu
02 February 2024
అమెరికా, రష్యా దేశాలను వేరు చేస్తూ బేరింగ్, చుక్చి సముద్రాల మధ్య ఉన్న డయోమెడ్ లిటిల్, బిగ్ అనే రెండు ద్వీపాలు.
డయోమెడ్ ద్వీపాలను 1728 ఆగస్టు 16న డెన్మార్క్‌కు చెందిన ఒక నావికుడు కనుగొన్నాడు. గ్రీక్ దేవుడైన డయోమెడ్ పేరు పెట్టాడు.
విస్తీర్ణంలో పెద్దగా ఉన్న ద్వీపానికి బిగ్ డయోమెడ్ అని, చిన్నగా ఉన్న ద్వీపానికి లిటిల్ డయోమెడ్ అని నామకరణం.
బిగ్ డయోమెడ్ అమెరికా దేశంలోని అలస్కా కిందకు వస్తుంది. లిటిల్ డయోమెడ్ రష్యా దేశం కిందకు వస్తుంది.
ఈ డయోమెడ్ ద్వీపాలను ఇంటర్నేషనల్ డేట్‌లైన్ వేరు చేస్తుంది. దీంతో రెండు ద్వీపాల్లో వేర్వేరు టైమ్ జోన్లను ఫాలో అవుతున్నారు.
లిటిల్ డయోమెడ్‌లో AKDT ( Alaska Daylight Time ), బిగ్ డయోమెడ్‌లో ANAT ( Anadyr Time ) టైమ్‌జోన్ ఉంటుంది.
రెండు టైమ్ జోన్ల మధ్య వ్యత్యాసం దాదాపు 21 గంటలు. బిగ్ డయోమెడ్‌లో తేదీ మారిన 21 గంటల తర్వాత లిటిల్ డయోమెడ్‌లో తేదీ మారుతుంది.
అమెరికాలోని బిగ్ డయోమెడ్‌ను టుమారో ఐలాండ్ అని, రష్యాలోని లిటిల్ డయోమెడ్‌ను ఎస్టర్ డే ఐలాండ్ అని పిలుస్తారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి