ఈ పండ్లు సర్వరోగ నివారిణి.. రోజూ తింటే సూపర్ హెల్త్ బెనిఫిట్స్ 

Jyothi Gadda

18 October 2024

చెర్రీస్ అంటే ఇష్టపడని వారు ఉండరు. ఇవి మంచి టేస్ట్‌తో పాటు చూడటానికి కూడా అట్రాక్టివ్‌గా ఉంటాయి. చెర్రీస్ అంటే ఇష్టపడని వారు ఉండరు. చెర్రీలో కేలరీలు, కొవ్వు తక్కువగా ఉంటాయి.

చెర్రీస్‌లో విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ వంటి విటమిన్లు,  ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. రుచిలో కాస్త తీయగా, పుల్లగా ఉండే చెర్రీల్లో ఆరోగ్య ప్రయోజనాలు అనేకం దాగున్నాయి. 

చెర్రీల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, జింక్, ఐరన్, బీటా కెరోటిన్, కాల్షియంతో పాటుగా ఇతర యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. 

చెర్రీస్‌లో ఆంథోసైనిన్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. అలాగే, ఇది గౌట్ లక్షణాలను తగ్గిస్తుంది. చెర్రీస్ విటమిన్ సి కలిగి ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది.

చెర్రీస్‌లో మెలటోనిన్ అనే హార్మోన్ ఉంటుంది. ఇది నిద్రను నియంత్రిస్తుంది. నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. అందుకే ప్రతిరోజూ కాస్త చెర్రీలు తింటే రాత్రిళ్లు హాయిగా నిద్ర పడుతుంది. 

క్యాలరీలు కూడా తక్కువగా ఉండటం వల్ల బరువు నియంత్రణకు మంచిది. అందుకే బరువు తగ్గాలనుకునే వారు చెర్రీలను డైట్ లో చేర్చుకుంటే ఉత్తమ ఫలితాలను పొందుతారు. 

విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ సమృద్ధిగా ఉండే చెర్రీలను మీ డైట్‌లో చేర్చుకోవటం వల్ల ఆకలిని తగ్గించి ఆరోగ్యంగా బరువు తగ్గేందుకు సహాయపడతాయి. 

చెర్రీస్ ఆంథోసైనిన్‌లు, ఫ్లేవనాయిడ్‌లతో సహా గుండె-ఆరోగ్యకరమైన సమ్మేళనాలు ఉంటాయి. ఈ సమ్మేళనాలు వాపు, కొలెస్ట్రాల్, రక్తపోటు స్థాయిలను తగ్గిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని దూరం చేస్తుంది.