షిర్డీ, ఎల్లోరా వయా శనిశిగ్నాపూరం.. తెలంగాణ టూరిజం నయా ప్యాకేజీ..
TV9 Telugu
11 July 2024
తెలంగాణ టూరిజం మరో సూపర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. షిర్డీ, ఎల్లోరా ట్రిప్ ను అతి తక్కువ ధరకే అందిస్తుంది.
రెండు రోజులు కొనసాగనున్న ఈ ట్రిప్ లో షిర్డీ, ఎల్లోరాతో మరి కొన్ని కవర్ అవుతాయి. ఈ టూరు బస్సులో చేయాల్సి ఉంటుంది.
షిర్డీ ఎల్లోరా టూర్ పేరుతో హైదరాబాద్ నగరం నుంచి ప్రతి బుధ, శుక్రవారం అందుబాటులో ఉంచింది తెలంగాణ టూరిజం.
హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం బయలుదేరి ఉదయం షిర్డీకి చేరుకుని సాయినాథుని దర్శనం అనంతరం శనిశిగ్నాపూరం దర్శించుకొని రాత్రి షిర్డీలోనే బస చేస్తారు.
ఉదయాన్నే షిర్డీ నుంచి ఎల్లోరా కేవ్స్ పర్యటనకి వెళ్తారు. ఇది పూర్తైన తర్వాత ఔరంగాబాద్ లోని మినీ తాజ్ మహల్ చూసి తెరిగి బయలుదేరుతారు.
తెలంగాణ టూరిజం దీని కోసం ఏసీ, నాన్ ఏసీ కోచ్ బస్సులు నడుపుతుంది. మీరు ఎంచుకున్న దాని బట్టి ధరలు ఉంటాయి.
మీకు ఏసీ బస్సు ప్యాకేజీ కావాలనుకొంటే పెద్దలకు రూ. 3550, పిల్లలకు రూ. 2890 టికెట్ ధర చెల్లించాల్సి ఉంటుంది.
నాన్ ఏసీ అయితే పెద్దలకు రూ.3100, పిల్లలకు రూ.2530గా ఉంది. https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లో ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి