తెలంగాణ ఫేమస్ ఫుడ్స్.. తప్పక ప్రయత్నించాలి..

TV9 Telugu

24 May 2024

తెలంగాణలోని అంకాపూర్ గ్రామంలో మొక్కజొన్నలు బాగా పండిస్తారు. మొక్కజొన్నతో చేసిన మక్క గూడాలు మరియు మక్క వడలకు  ప్రత్యేక స్థానం ఉంది.

తెలంగాణ మిల్లెట్స్ ఉల్లిపాయలు, మిర్చి, పచ్చి ఆకులు, ఉప్పు మొదలైనవి వేసి తయారు చేసిన బొబ్బర్లు చాల రుచిగా ఉంటాయి.

ఒట్టి చేపలు కూర పోచమ్మ దేవి, మైసమ్మ దేవి వంటి గ్రామ దేవతలకు పవిత్రమైన ప్రసాదంగా తయారుచేస్తారు. ఇది తెలంగాణ పండుగల్లో ముఖ్య ఆహారం.

అంకాపూర్ చికెన్ తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా, అంకాపూర్ గ్రామంలో ప్రసిద్ధి చెందిన దేశీ కోడి కూర.

సకినాలు సంక్రాంతి, దసరా లాంటి పండుగలు, జాతరలు జరిగే సమయంలో ప్రత్యేకంగా తయారుచేసే రుచికరమైన స్నాక్స్ కి ఒకటి.

కొబ్బరి సద్ది అనేది తెలంగాణలోని బతుకమ్మ పండుగ సందర్భంగా తయారుచేసే పౌష్టికాహారంతో కూడిన రుచికరమైన ఆహారం.

మలిద లడ్డు తెలంగాణ సాంప్రదాయ వంటకాల్లో ఒకటి. ఇక్కడ బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేస్తారు.

తలకాయ కూర ఒక మసాలా కూర. ఇది బోనాలలో అత్యంత ముఖ్యమైన వంటకం. ఇది తెలంగాణ సంప్రదాయ వంటల్లో దీనికి ప్రత్యేక స్థానం ఉంది.