చింత చిగురులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. అలాగే శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించి శరీరాన్ని శుభ్రపరుస్తుంది.
చింతచిగురును తీసుకుంటే శరీరంలో ఎర్రరక్తకణాల వృద్ధి జరుగుతుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేసి గుండె జబ్బులు రాకుండా సహాయపడుతుంది. చింత చిగురులో ఉండే గుణాలు ఎముకలను బలోపేతం చేసి దృఢంగా మారుస్తాయి.
కీళ్ల నొప్పులు, వాపులతో బాధపడేవారు చింతచిగురు పేస్టును కీళ్ళపై కట్టులా కట్టుకుంటే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. షుగర్ వ్యాధితో బాధపడే వారికి మంచి పరిష్కారంగా చింతచిగురు సహాయపడుతుంది.
ఇది రక్తంలోని చక్కెర నిల్వలను తగ్గించి షుగర్ వ్యాధిని నియంత్రిస్తుంది. కనుక షుగర్ వ్యాధితో బాధ పడేవారు చింతచిగురును తీసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు. చింతచిగురులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.
చింతచిగురులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ఆస్కార్బిక్ యాసిడ్‌లు, టార్టారిక్ యాసిడ్‌లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో, జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడతాయి.
చింతచిగురులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడంలో సహాయపడతాయి. చింతచిగురును ముఖానికి ప్యాక్‌గా కూడా ఉపయోగించవచ్చు. ఇది మొటిమలను తగ్గించడంలో, చర్మానికి నిగారింపునిస్తుంది.
చింతచిగురులోని ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయిలను పెంచుతుంది. చింతచిగురులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది..
చింతచిగురు జుట్టు రాలడాన్ని నివారించడానికి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి సహాయపడుతుంది. చింతచిగురు ఆకులతో తయారు చేసిన హెయిర్ ప్యాక్‌ను జుట్టుకు పట్టించి, 30 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే జుట్టు రాలడం తగ్గి పెరుగుదల ఉంటుంది.