ఉప్పును మరీ తగ్గిస్తున్నారా.? 

14 October 2023

శరీరానికి కావాల్సిన ముఖ్యమైన పోషకాల్లో ఉప్పు కూడా ఒకటి. కండరాల్లో కదలికలు బాగుండాలంటే సరిపడా ఉప్పు తీసుకోవాలి.

శరీరానికి సరిపడ ఉప్పు తీసుకుంటేనే జీవక్రియ బాగుంటుంది. నాడుల్లో సమాచారం సక్రమంగా సాగుతుంది. 

ఉప్పులో ఉండే సోడియం, క్లోరిన్‌ శరీరానికి మేలు చేస్తాయి. నాడులు, కండరాలు చక్కగా పనిచేయడానికి ఇవే ప్రధాన కారణం.

అయితే ఉప్పును భారీగా తగ్గిస్తే కణాల లోపల ఒత్తిడి పెరిగిపోతుంది. దీంతో వాటిలోని ద్రవాల్లో సమతుల్యం దెబ్బతింటుంది. 

దీంతో కణాల్లో నీరు అధికంగా పేరుకుపోయి శరీరం అంతా ఉబ్బిపోయినట్లు కనిపిస్తుంది. 

శరీరంలో ఉప్పు తగ్గితే తల తిరగడం, కళ్లు తిరిగి పడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు కోమాలోకి కూడా వెళ్లే అవకాశాలు ఉంటాయి. 

వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ లెక్కల ప్రకారం రోజుకు మనిషి 5 గ్రాముల ఉప్పును తీసుకోవాలి. 

అంతకంటే తక్కువ తీసుకున్నా, ఎక్కువ తీసుకున్నా ప్రమాదమే. ఎక్కువ తీసుకుంటే బీపీ, గుండె సమస్యలు వస్తాయని తెలిసిందే.