ఎముకలు బలంగా ఉండాలా..? 

02 october 2023

ఎముకలు బలంగా మారడంలో చీజ్‌ ఉపయోగపడుతుంది. చీజ్‌ను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవడం వల్ల ఎముకలు బలంగా మారుతాయి. ఇందులో ప్రోటీన్‌ పుష్కలంగా ఉంటుంది. 

చీజ్‌...

పాలకూర కాల్షియంకు పెట్టింది పేరు. ఇది ఎముకల ఆరోగ్యాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తుంది. రోజువారీ అవసరమైన కాల్షియంలో 25 శాతం పాలకూర నుంచి లభిస్తుంది. ఐరన్‌, విటమిన్‌ ఏలు కూడా ఇందులో అధికంగా ఉంటాయి. 

పాలకూర..

ఎముకలు బలంగా మారడంలో సోయాబీన్స్‌ కూడా ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఇందులోని ప్రోటీన్‌, కాల్షియం ఎముకలను బలంగా మారుస్తాయి. 

సోయాబీన్స్‌.. 

ఎముకలు బలంగా మారాలంటే పాల ఉత్పత్తులను తీసుకోవడం అలవాటుగా మార్చుకోవాలి. పాలు, పెరుగు వంటి వాటిలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలకు మేలు చేస్తుంది. 

పాల ఉత్పత్తులు.. 

ఎముకల ఆరోగ్యాన్ని కాపాడడంలో బాదం కీలక పాత్ర పోషిస్తుంది. బాదంలో ఉండే కాల్షియం ఎముకలను బలంగా మారుస్తుంది. వీటిలో కాల్షియంతోపాటు విటమిన్‌ ఇ కూడా అధికంగా ఉంటుంది.

బాదం..

ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే నారిజంను రోజు ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఫ్రెష్‌ ఆరెంజ్‌ జ్యూస్‌లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. 

నారింజ..

ఇక ఆహారంతో పాటు నీటిని కూడా సరిగ్గా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీటిని తాగాలని సూచిస్తున్నారు. వీటితో పాటు రోజూ కనీసం ఓ అరగంట వ్యాయామం చేయాలి. 

సరిపడ నీరు.. 

వీటన్నితో పాటు శరీరానికి సరిపడ విటమిన్‌ అందేలా చూసుకోవాలి. ఉదయం కాసేపు ఎండలో నడవడం కచ్చితంగా అలవాటు చేసుకోవాలి. విటమిన్‌ డీతో ఎముకలు బలంగా మారుతాయి

విటమిన్‌ డి..