01 March 2024

ఈ లక్షణాలుంటే.. విటమిన్‌  డీ లోపం ఉన్నట్లే. 

TV9 Telugu

విటమిన్‌ డీ లోపం ఉంటే తరచుగా అనారోగ్యానికి గురవుతుంటారని నిపుణులు చెబుతున్నారు. ఇలా దీర్ఘకాలంగా సమస్య ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. 

తరచుగా అలసిపోతున్నా, చిన్న చిన్న పనులకే నీరసంగా ఉంటున్నా విటమిన్‌ డీ లోపంగా భావించాలని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించుకోవాలి. 

ఇక శారీరక సమస్యలతో పాటు మానసిక సమస్యలకు కూడా విటమిన్‌ డీ లోపం కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. విటమిన్‌ డీ లోపం కారణంగా డిప్రెషన్‌ వేధిస్తుందని అంటున్నారు.

దీర్ఘకాలంగా జుట్టు రాలుతుంటే కూడా విటమిన్‌ డీ లోపంగా భావించాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మహిళలల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. 

దద్దుర్లు, చర్మం పొడిబారం వంటి లక్షణాలు కూడా విటమిన్‌ డీ లోపం వల్ల తలెత్తే లక్షణాలే అని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. 

దీర్ఘకాలికంగా ఒంటి నొప్పులు, కీళ్ల నొప్పలు వంటి సమస్యలు వెంటాడుతుంటే కూడా విటమిన్‌ డీ లోపంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. 

కొందరిలో అదే పనిగా వెన్న నొప్పి వేధిస్తుంటుంది. అయితే ఇది కూడా విటమిన్‌ డీ లోపం లక్షణమేనని వైద్యులు చెబుతున్నారు. ఈ సమస్య ఉంటే పరీక్ష చేయించుకోవాలి. 

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.