ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? పొటాషియం లోపం ఉన్నట్లే
Narender Vaitla
12 Aug 2024
పొటాషియం తగ్గితే తరచుగా కండరాల్లో తిమ్మిరి ఏర్పడుతుంది. పొటాషిం కండరాల సంకోచాలను నియంత్రిస్తుంది. అయితే శరీరంలో పొటాషియం తగ్గితే కండరాల కదలికల్లో ఇబ్బందులు వస్తాయి.
పొటాషియం జీర్ణ వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. పొటాషియం లోపం పేగుల్లో కండరాల సంకోచాలపై ప్రభావం చూపుతుంది. దీంతో ఇది మలబద్ధకానికి కారణమవుతుంది.
గుండె కొట్టుకునే తీరులో తేడాలకు కూడా పొటాషియం లోపమే కారణంగా చెప్పొచ్చు. గుండె కొట్టుకునే వేగం పెరిగితే పొటాషియం లోపం ఉన్నట్లు అర్థం చేసుకోవాలి.
పొటాషియం తగ్గితే శరీరంలో సోడియం లెవల్స్ పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబతున్నారు. శరీరంలో కాళ్లు లేదా చేతులు ఇన్నట్లుండి ఉబ్బినట్లు కనిపిస్తే పొటాషియం లోపంగా భావించాలి.
ఇక శరీరంలో పొటాషియం లోపంలో కనిపించే ప్రధాన లక్షణాల్లో బీపీ ఒకటి. పొటాషియం తగ్గితే రక్తపోటు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
శరీరంలో పొటాషియం లెవల్స్ పెరగాలంటే తీసుకునే ఆహారంలో అరటి పండ్లను భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
ఇక చిలగడదుంప, బచ్చలికూర, కమలపండ్లు, అవోకాడో వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కూడా శరీరంలో పొటాషియం స్థాయిలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.