చిన్నపిల్లల్లోనూ బీపీ.. లక్షణాలు ఇవే 

11 september 2023

మారుతోన్న జీవనశైలి కారణంగా చిన్నారుల్లో కూడా అధిక రక్తపోటు సమస్య కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం స్థూలకాయమని నిపుణులు చెబుతున్నారు. 

12 నుంచి 16 ఏళ్లలోపు చిన్నారుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. కొన్ని లక్షణాల ఆధారంగా ఈ సమస్యను వెంటనే తెలుసుకోవచ్చని చెబుతున్నారు. 

చిన్నారుల్లో అసాధారణ హృదయ స్పంద ఉంటే వెంటనే అలర్ట్ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు. 

ఇక చిన్నారుల్లో బీపీ గుర్తించే మరో లక్షణం శ్వాస తీసుకోవడంలో సమస్యలు. ఇలాంటి లక్షణం కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. 

ఇక కొందరు చిన్నారులు చిన్న విషయానికే పెద్ద పెద్దగా కేకలు వేస్తుంటారు. ఇలాంటి వారి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. 

అలాగే కొందరు చిన్నారులు ఇంట్లో వారిపై పదే పదే చిరాకు పడుతుంటారు. ఇలాంటి వారిలో కూడా బీపీ వచ్చే ప్రమాదం ఉంటుంది. 

ఈ సమస్యకు లైఫ్‌స్టైల్‌లో వచ్చే మార్పులే ప్రధాన కారణమి నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడితో కూడుకున్న వాతావరణం కూడా ఇందుకు కారణంగా చెబుతున్నారు. 

చిన్నతనంలోనే పిజ్జా, బర్గర్లు, కూల్‌ డ్రింక్స్‌ వంటివి చిన్నారులకు అలవాటు చేయొద్దని నిపుణులు చెబుతున్నారు.