ఈ లక్షణాలు కనిపిస్తే.. వెంటనే షుగర్ టెస్ట్ చేయించుకోండి
Narender Vaitla
26 Aug 2024
డయాబెటిస్ వచ్చిన వారిలో కనిపించే మొదటి లక్షణం మూత్ర విసర్జన. సాధారణం కంటే ఎక్కువ మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తే వెంటనే డయాబెటిస్ పరీక్షలు చేయించుకోవాలి.
డయాబెటిస్ బారిన పడిన వారిలో కనిపించే మరో ప్రధాన లక్షణం అలసట ఎక్కువగా ఉండడం. భోజనం చేసినా నిత్యం అలసటగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
డయాబెటిస్ వచ్చిన వారిలో జుట్టు రాలడం కూడా సర్వసాధారణం. జుట్లు రాలుతుంటే వెంటనే వైద్యులను సంప్రదించి, సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి.
డయాబెటిస్ ప్రాథమిక లక్షణాల్లో చర్మ సంబంధిత సమస్యలు కూడా ఒకటని నిపుణులు చెబుతున్నారు. చర్మంపై మచ్చలు కనిపిస్తే షుగర్ వ్యాధి వచ్చి ఉండొచ్చని అర్థం చేసుకోవాలి.
ఎలాంటి కారణం లేకుండా తలనొప్పి వస్తే కూడా అలర్ట్ అవ్వాలి. దీర్ఘకాలంగా తలనొప్పితో బాధపడుతుంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం
డయాబెటిస్ వచ్చే వారిలో కనిపించే ప్రాథమిక లక్షణాల్లో కంటి సంబధిత సమస్యలు కనిపిస్తాయి. కళ్లు మసకబారినట్లు అనిపిస్తే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
సరిపడ నీరు తీసుకుంటున్నా నిత్యం దాహం వేస్తుంటే.. అదికూడా డయాబెటిస్‌కు కారణం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.