ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? ఆ లోపం ఉన్నట్లే.. 

Narender Vaitla

28 September 2024

శరీరంలో కాల్షియం లోపిస్తే హృదయ స్పందనలో మార్పులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాల్షియం లోపం లోపం గుండె కండరాలపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.

కాల్షియం లోపం ఉన్న వారిలో కండరాల తిమ్మిరి కనిపిస్తుంది. కండరాల్లో నొప్పి, తిమ్మిరి, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చేతులు, కాళ్లలో జలదరింపు వంటి లక్షణాలు కనిపించినా శరీరంలో క్యాల్షియం లోపం ఉన్నట్లు అర్థం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

శరీరంలో కాల్షియం లోపం కారణంగా దంతాల ఆరోగ్యం కూడా దెబ్బ తింటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా దంతక్షయం, చిగుళ్ల నుంచి రక్తం రావడం వంటి సమస్యలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

రక్తంలో కాల్షియం తగ్గినప్పుడు చర్మం సంబంధిత సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కాల్షియం లోపిస్తే చర్మం తేమ కోల్పోతుంది. దీంతో చర్మం డ్రైగా మారుతుంది

కాల్షియం లోపిస్తే గోర్ల ఆరోగ్యం కూడా దెబ్బ తింటుంది. ముఖ్యంగా గోర్ల చివర్లు విరిగిపోతాయి, అలాగే గోర్లు చీలిపోతుంటాయి.

మహిళల్లో కాల్షియం లోపం ఉంటే నెలసరి సమయంలో విపరీతమైన నొప్పితో బాధపడుతుంటారు. అలాగే రక్తస్రావం అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ సమస్యలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవడం మంచిది.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.