పెరుగుతోన్న జనాభాతో పాటు రోగాలు కూడా పెరుగుతున్నాయి. శారీరక రోగాలకు తోడు ఇప్పుడు మానసిక రోగాలు వెంటాడుతున్నాయి.
దేశవ్యాప్తంగా మానసిక అనారోగ్యం బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. మానసిక క్షోభను అనుభవిస్తూ చాలా మంది జీవితాన్ని నరకంగా మార్చుకుంటున్నారు.
అన్ని ఉన్నా ఏదో లేదనే లోటు, జీవితంలో సంతోషం లేదన్న కారణం, తీవ్రమైన ఒత్తిడి కారణం ఏదైనా మానసిక వ్యాధుల బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది.
అయితే చాలా మంది దీనిని అసలు ఓ వ్యాధిలా కూడా భావించడం లేదు. అందుకే మానసిక సమస్య ఉన్నట్లు కనిపించగానే వెంటనే మానసిక వైద్యులను కలవాలని చెబుతున్నారు.
సరైన చికిత్స, మందులతో మానసిక రోగాలను తరిమికొట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. జీవితంపై సానుకూల దృక్పథం పెంచుకోవచ్చంటున్నారు.
శరీరంలో జరిగే రసాయనిక మార్పులు, హార్మోన్ల మార్పులే మానసిక వ్యాధులకు ప్రధాన కారణం. సెరటోనిన్ మెదడులోని నాఈడ కణాల్లో తగ్గినప్పుడు డిప్రెషన్ వస్తుంది.
ఈ వ్యాధి బారిన పడిన వారు నిత్యం విషాదంలో ఉంటారు. ఆత్మహత్య ఆలోచనలు, నిద్ర రాకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
అయితే ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే యంత్రాలు, మంత్రాలు అని కాకుండా మంచి మానసిక వైద్య నిపుణుడిని సంప్రదించాలని చెబుతున్నారు.