శరీరంలో పొటాషియం తగ్గితే..కండరాల పనితీరుపై ప్రభావం పడుతుంది. దీంతో కండరాల్లో నొప్పులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
శరీరంలో తగినంత పొటాషియం లోపిస్తే.. చెమట ఎక్కువగా ఉంటుంది. వాతావరణంతో సంబంధం లేకుండా చెమటలు వస్తుంటే పొటాషియం లోపం ఉన్నట్లే అర్థం చేసుకోవాలి.
నిత్యం అలసటగా ఉండడం, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు ఏర్పడడం కూడా పొటాషియం లోపం లక్షణాలుగా చెప్పుకొచ్చానే. ఎలాంటి పనిచేయకపోయినా అలసిపోతుంటారు.
భుజాలు, కాళ్లలో అకారణంగా తిమ్మిరి పట్టినట్టుంటే లేదా చర్మం తిమ్మిరి పడుతుంటే పొటాషియం లోపముందని అర్ధం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
శరీరంలో పొటాషియం లోపిస్తే తరచూ మూత్రం రావడం వంటి లక్షణం కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతీసారి యూరిన్ వస్తున్నట్లు అనిపించినా పొటాషియం లోపం ఉన్నట్లే.
పొటాషియం లోపిస్తే జీర్ణక్రియపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలకు పొటాషియం లోపం కారణమని నిపుణులు అంటున్నారు.
పొటాషియం లోపాన్ని జయించాలంటే చికెన్, మటన్ వంటి మాంసాహారాన్ని ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
అదే విధంగా అరటి పండు, చిలగడదుంప, కూరగాయలను క్రమంతప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవాలి. దీని వల్ల పొటాషియం లోపాన్ని జయించవచ్చు.