రైలు ప్రయాణికులకు స్విగ్గీ ఫుడ్‌

TV9 Telugu

08 March 2024

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఫుడ్ డెలివరీ యాప్స్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చెయ్యడం సర్వసాధారణం. దీంతో ఇంటి వద్దకే ఆహారం వస్తుంది.

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీ ఇక పై రైలు ప్రయాణికులకు కూడా తమ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

మార్చి 12వ తేదీ నుంచి సేవలు అందించేందుకు సిద్ధమైంది. ఐఆర్‌సీటీసీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది స్విగ్గీ

తొలివిడతలో విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ఒడిసాలోని భువనేశ్వర్‌ రైల్వేస్టేషన్లలో ఈ సేవలు ప్రారంభంకానున్నాయి.

రాబోయే కొద్ది వారాలలో దేశంలోని మరో 59 రైల్వే స్టేషన్లకు తమ సేవలను విస్తరించనున్నట్టు స్విగ్గీ తెలిపింది.

ప్రయాణికులు స్విగ్గీలో మీల్స్‌ ఆర్డర్‌ చేయాలంటే ముందుగా ఐఆర్‌సీటీసీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

పీఎన్‌ఆర్‌ నంబర్‌ను ఎంటర్‌ చేసి.. తాము కోరుకున్న ఆహారాన్ని, కావాల్సిన స్టేషన్‌లో డెలివరీ తీసుకోవచ్చు.

కోరుకున్న ఆహరాన్ని ఆస్వాదిస్తూ ప్రయాణాన్ని మరింత సంతోషంగా మార్చుకోవాలని ఐఆర్‌టీసీ అధికారులు కోరుతున్నారు.