ఈసారి మార్కెట్లో స్వీట్ కార్న్‌ కచ్చితంగా కొనేయండి..

Narender Vaitla

01 December 2024

స్వీట్‌కార్న్‌లో ఫైబర్‌ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. కడుపుబ్బరం, గ్యాస్‌ సమస్యలను దూరం చేస్తుంది.

షుగర్‌ పేషెంట్స్‌కి కూడా స్వీట్ కార్న్‌ బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని ఫైబర్‌ కంటెంట్‌ రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది.

కంటి ఆరోగ్యానికి కూడా స్వీట్ కార్న్‌ ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు కంటి ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

శరీరానికి కావాల్సిన ఇన్‌స్టాంట్ శక్తిని అందించడంలో కూడా స్వీట్‌ కార్న్‌ కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని కార్బోహైడ్రేట్స్‌ వెంటనే శక్తిని అందిస్తాయి.

స్వీట్ కార్న్‌లో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మంపై కొల్లజెన్ ఉత్పత్తికి తోడ్పడుతాయి. చర్మం సాగే గుణానికి సహకరిస్తాయి. వృద్ధాపచాయలు త్వరగా రాకుండా చేస్తాయి.

గర్భిణీలకు కూడా స్వీట్ కార్న్‌ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. స్వీట్ కార్న్‌లో లభించే ఫొలేట్‌ గర్భిణీలతో పాటు పుట్టబోయే బిడ్డలకు మేలు చేస్తుంది.

రక్తపోటును అదుపు చేయడంలో కూడా స్వీట్ కార్న్‌ ఉపయోగపడుతుంది. ఇందులోని పొటాషియం కంటెంట్‌ బీపిని కంట్రోల్ చేస్తుంది.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.