స్వీట్‌కార్న్‌లో సరైన మోతాదులో ఫైబర్ సహా మన శరీరానికి కావాల్సిన అనేక రకాల విటమిన్లు, మినరల్స్ లభిస్తాయి. విటమిన్ ఏ, బీ-కాంప్లెక్స్, సీతో పాటు పొటాషియం, మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
స్వీట్ కార్న్ లో న్యూట్రన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది తక్షణ శక్తి లభిస్తాయి అంతేకాదు స్వీట్ కార్న్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇందులో మన శరీరానికి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ కూడా ఉంటాయి.
స్వీట్ కార్న్ లో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో కార్బోహైడ్రేట్స్ ఫైబర్, ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి ఉంటాయి. ఇది శరీర ఆరోగ్యానికి ఎంతో మంచిది. మినరల్స్, విటమిన్స్ మన శరీరానికి ఎంతో అవసరం.
స్వీట్ కార్న్ లో కరిగే కరిగని ఫైబర్ ఉంటుంది ఇది జీవన ఆరోగ్యానికి ఎంతో అవశ్యకం మలబద్ధకం సమస్య రాకుండా నివారిస్తుంది. స్వీట్ కార్న్ కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
స్వీట్ కార్న్ లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి ఎంతో అవసరం కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే జియాంథీన్, లుటీన్ కంటి సంబంధిత సమస్యలు రాకుండా నివారిస్తాయి.
స్వీట్ కార్న్ లో విటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది చర్మంపై కొల్లజెన్ ఉత్పత్తికి తోడ్పడుతాయి. చర్మం సాగే గుణానికి సహకరిస్తాయి ఇంకా వృద్ధాపచాయలు త్వరగా రావు
బరువు తగ్గాలనుకునేవారు తమ డైట్లో స్వీట్‌కార్న్‌ను తప్పకుండా చేర్చుకోవాలి. వాటిలో ఉండే ఫైబర్ కారణంగా మనం కొంచెం తిన్నా కడుపు నిండిపోతుంది. దీంతో ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉండదు.
స్వీట్‌కార్న్‌లో ఉండే ఫోలెట్ రక్తనాళాలలోని హోమోసిస్టీన్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. దీంతో గుండె వ్యాధుల సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. స్వీట్ కార్న్‌లో కార్బోహైడ్రేట్స్ అధిక మోతాదులో ఉంటుంది. అందుకే ఇది తిన్న వెంటనే శక్తి అందుతుంది.