షాకింగ్.. ప్రైవేట్ జాబ్స్ చేసే వారికే వ్యాధులు ఎక్కువ!

Samatha

3 august  2025

Credit: Instagram

చాలా మంది ప్రభుత్వ ఉద్యోగం చేయాలని కోరుకుంటారు. కానీ కొన్ని కారణాల వలన ప్రైవేట్ జాబ్ చేయాల్సి వస్తుంది.

అయితే ఈ ప్రైవేట్ జాబ్ చేయడంపై సర్వేలో కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడి అయ్యాయి. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

ప్రైవేట్ జాబ్ చేసే వారికే వ్యాధులు ఎక్కువ వస్తున్నట్లు ఓ సర్వేలో వెళ్లడైంది. ప్రైవేట్ రంగంలో పనిచేసే 70 శాతం మంది జీవన శైలి వ్యాధులతో సతమతం అవుతున్నారంట.

ప్రైవేట్ రంగం ఉద్యోగులపై చేసిన ఓ సర్వేలో ప్రైవేట్ ఉద్యోగం చేసే వారు అధిక ఒత్తిడితో సతమతం అవుతున్నట్లు తేలిందంట.

అంతే కాకుండా  సర్వేలో ఇందులో వర్క్ చేసే వారు అధిక రక్తపోటు, ఊబకాయం, మానసిక ఒత్తిడి, మధుమేహం వంటి సమస్యలు ఎక్కువ ఉన్నాయంట.

అలాగే ప్రైవేట్ ఉద్యోగుల్లో రోజు రోజుకు మానసిక ఒత్తిడి పెరుగుతుందని,  కిడ్నీ సమస్యలు , అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువ ఉన్నదంట.

అలాగే చాలా మంది పని ఒత్తిడి కారణంగా తమ వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించలేక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తేలిందంట.

మారుతున్న జీవనశైలి, షిప్ట్‌లు, స్ట్రెస్ వంటి వాటివలన ఈ అనారోగ్య సమస్యలు పెరుగుతున్నట్లు నిపుణులు తెలియజేశారు.