గసగసాల్లో ప్రొటీన్లు, పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. మన శరీరానికి అవసరమైన విటమిన్లు, కాల్షియం, మాంగనీస్, జింక్ వంటి ఖనిజాలు లభిస్తాయంటున్నారు నిపుణులు.
TV9 Telugu
చాలా తక్కువ వాటిల్లో దొరికే ఒమేగా-3, ఒమేగా-6 ఫాటీ ఆమ్లాలు గసగసాల్లో సమృద్ధిగా లభిస్తాయంటున్నారు. కాబట్టి వీటితో మంచి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయంటున్నారు.
TV9 Telugu
గసగసాల్లో అధికంగా ఉండే పీచు పదార్థం.. ఆహారం సులభంగా జీర్ణం అవడానికి తోడ్పడుతుంది. పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మలబద్దకం, అజీర్తి, కడుపు ఉబ్బరాన్ని దూరం చేస్తుంది.
TV9 Telugu
గసగసాలతో తయారు చేసిన నూనెలో మోనో, పాలీ శాచురేటెడ్ కొవ్వు పదార్థాలు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు నిపుణులు.
TV9 Telugu
గసగసాల్లో ఉండే అన్ శాచురేటెడ్ కొవ్వులు చెడు కొలస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. దీంతో గుండె ఆరోగ్యానికి తోడ్పడుతాయంటున్నారు నిపుణులు.
TV9 Telugu
గసగసాలతో చేసిన టీ తాగడం వల్ల నిద్రలేమి సమస్య నుంచి బయటపడొచ్చంటున్నారు నిపుణులు. గసగసాలను వేడి చేసిన నీటిలో వేసి టీ తయారు చేసుకోవచ్చు. ఈ టీ తాగితే చక్కగా నిద్రపడుతుంది.
TV9 Telugu
గసగసాల్లోని చల్లదనం లక్షణం వల్ల నోటి అల్సర్ల బాధ నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే కాల్షియం, మాంగనీస్ ఎముకలు బలంగా ఉండేలా చేస్తుంది.
TV9 Telugu
గసగసాల్లో చర్మం, జుట్టుకు మేలు చేసే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల జుట్టు పెరుగుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉండి అకాల వృద్ధాప్యాన్ని దూరం చేస్తుంది.