గుండె జబ్బులున్న వారు సీతా ఫలం తినచ్చా?

11 December 2023

ఆరోగ్యానికి మేలు చేసే సీజనల్ పండ్లలో సీతాఫలం ముఖ్యమైనది. ఎంత తిన్నా తనివి తీరని ఈ పండులో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఎన్నో ఉన్నాయి

సీతాఫలంలో ఉండే ఫైబర్‌, విటమిన్లు, ఖనిజాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహకరిస్తాయి. అలాగే కంటి ఆరోగ్యాన్నీ మెరుగుపరుస్తాయి

అయితే సీతాఫలం ఒకన్ని రకాల సమస్యలతో బాధపడేవారు అస్సలు తినకూడదనే అపోహలు ఉన్నాయి. వాటి గురించి నిపుణుల మాటల్లో మీకోసం

బరువు ఎక్కువగా ఉన్న వాళ్లు సీతాఫలం తినకూడదని అంటుంటారు. నిజానికి ఇది ఓ రకంగా అపోహే అంటున్నారు నిపుణులు

సీతాఫలంలో కొవ్వులు, క్యాలరీలు చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. ఇక ఇందులో అధిక మొత్తంలో ఉండే ఫైబర్‌ కడుపు నిండిన భావన కలిగేలా చేస్తుంది

తద్వారా ఎక్కువ సమయం ఆకలేయకుండా ఉంటుంది. తద్వారా క్రమంగా బరువు తగ్గచ్చు. సీతాఫలంలో ఉండే విటమిన్‌ బి6 కడుపుబ్బరం, అజీర్తి, అల్సర్లు వంటి సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది

అలాగే గుండె జబ్బులున్న వారు కూడా సీతాఫలం తినకూడదనే అపోహ ఉంది. నిజానికి శరీరంలో మెగ్నీషియం లోపిస్తే గుండెపై ప్రతికూల ప్రభావం పడుతుంది

సీతాఫలంలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇందులో ఉండే ఖనిజాలు, విటమిన్‌ ‘సి’ రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి