01 August 2024
TV9 Telugu
Pic credit - Social Media
ప్రపంచంలో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 300 రకాల మొక్కజొన్నలు ఉన్నాయి. పసుపు రంగులో మాత్రమే కాదు నలుపు, ఆకుపచ్చ, నీలం, ఎరుపు ఇలా రకరకాల రంగులలో కనిపిస్తాయి.
7000 సంవత్సరాల క్రితం కూడా నల్ల మొక్కజొన్నను ఇంకాస్, క్వెచువా, మోచికా తెగలు ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగించారు.
నలుపు రంగు మొక్క జొన్న నిజంగా మానవ శరీరంపై సానుకూల ప్రభావాన్ని చూపే ప్రత్యేకమైన పోషకాలను కలిగి ఉందని శాస్త్రవేత్తలు నిరూపించారు
నలుపు మొక్క జొన్న రిటైల్ మార్కెట్‌లో లేదా ఆన్‌లైన్ లో నైనా ఖరీదు చేయవచ్చు. నల్ల జొన్న కంకి ఒకొక్కటి సుమారు రూ. 200లు దొరుకుతుంది.
బ్లాక్ కార్న్‌లో ఐరన్, థయామిన్, రైబోఫ్లావిన్, నియాసిన్, మెగ్నీషియం, ఫోలేట్, ఫాస్పరస్ , విటమిన్ ఎ వంటి ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి
నలుపు మొక్కజొన్న ప్రోటీన్‌లో అవసరమైన అమైనో ఆమ్లాలు ట్రిప్టోఫాన్, లైసిన్ ఉన్నాయి. ఇవి డిప్రెషన్. నిద్రలేమితో సమర్థవంతంగా పోరాడటానికి సహాయపడతాయి.
యాంటీఆక్సిడెంట్ కంటెంట్‌లో పుష్కలంగా ఉన్న బ్లాక్ కార్న్ అకాల వృద్ధాప్యం, వాపు సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.
పసుపు మొక్కజొన్న కంటే బ్లాక్ కార్న్‌లో 20 శాతం ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. ఇది శరీరంలోని రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది
నల్ల కంకిలో ఉన్న ఆంథోసైనిన్ పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. తక్కువ గ్లైసెమిక్ సూచికతో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించగలదు