నేలపై కూర్చుంటున్నారా? ఎన్ని లాభాలో..

21 November 2023

అన్నం తినేటప్పుడు నేలపై కూర్చోవడం భారతీయ సంస్కృతి. భోజనం చేసేటప్పుడు మాత్రమేకాకుండా వంటా వార్పు వంటివి కూడా నేలమీద కూర్చునే చేసేవారు

మన పూర్వికుల్లా కాకుండా నేటి తరం కుర్చీలు, టేబుల్స్ వచ్చిన తరువాత నేలపై కూర్చోవటం అన్నది బొత్తిగా మానేశారు

తినేటప్పుడూ, టీవీ చూసేటప్పుడూ కుర్చీల మీదో, మంచాలమీదో కూర్చుని గంటల తరబడి తినేస్తుంటారు.. సోఫాలపై చారగిలా పడుకుని ఉండిపోతున్నారు

దీనివల్ల దీర్ఘకాలంలో వెన్ను, నడుము, తుంటిలో నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు 

అదే సమయంలో నేలమీద కూర్చోవడం వల్ల చురుకుదనంతోపాటు, శరీర కదలికలు సులభ తరంగా మార్చుకోవచ్చు. కండరాలు కూడా శక్తివంతంగా మరతాయి

నేలపై కూర్చొని తినడం వల్ల, కంచం ముందుకు వంగి తినాల్సి వస్తుంది. అలా చేయడం వల్ల పొట్ట కండరాలు కదిలి జీర్ణ ప్రకియ సజావుగా సాగడానికి సాయపడే రసాలు విడుదలవుతాయట

డైనింగ్‌ టేబుల్‌ వద్ద కుర్చీలో కూర్చోవటం వల్ల తుంటి బాగం బిగుతుగా మారే అవకాశం ఉంటుంది. అయితే నేతలపై కూర్చోవటం వల్ల హిప్ ఫ్లెక్సిబిలిటీని పెంచుకోవచ్చంటున్నారు

అలాగే కండరాలను సాగదీయడంలో, చలనశీలతను పెంచటంలో ఈ పద్ధతి దోహదపడుతుంది. ఇది కూడా ఒకరకమైన శారీర శ్రమలాంటిదే.