ఛీ యాక్‌.. నల్లగా ఉన్నాయని చిన్నచూపు చూస్తున్నారా? 

March 17, 2024

TV9 Telugu

మనదేశంలోని దక్షిణాది రాష్ట్రాల ప్రధాన ఆహారం బియ్యం. ఒక దక్షిణాది భారత్ ప్రజలకు మాత్రమేకాకుండా ప్రపంచంలోనే సగం మంది జనాభాకు బియ్యమే ప్రధాన ఆహారం

బియ్యంలో చాలా రకాలు ఉన్నాయి. అందులో లావుబియ్యం, సన్నబియ్యం, బాస్మతి బియ్యం, ఇడ్లీ బియ్యం, దంపుడుబియ్యం, నూక బియ్యం.. అంటూ ఎన్నో రకాలు మార్కెట్లో దొరుకుతున్నాయి

అయితే మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు తెల్లబియ్యంతో వండిన ఆహారం అధికంగా తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. దీంతో నల్లబియ్యం వాడకం పెరిగింది

ఈ మధ్య ఆరోగ్యానికి మంచివంటూ చాలా మంది నల్లబియ్యం అన్నం తినేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరి ఇంతకీ దీని ప్రయోజనాలేంటో, ఇందులోని పోషకాలు ఏమిటో తెలుసుకుందామా..

నిజానికి, సాధారణ బియ్యంతో పోల్చితే.. నల్లబియ్యంలో పోషకాలు ఎక్కువ అని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిల్లో పీచు పదార్ధాలు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి

అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు, బీపీ ఉన్నవారూ వీటిని తినొచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని అదుపు చేస్తాయి

ఆంథోసైనిన్లు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా బ్లాక్‌ రైస్‌లో శక్తివంతమైన కెరోటినాయిడ్లు ఉంటాయి. ఇందులోని ల్యూటిన్‌, జియాజాంథిన్‌ వంటివి అతినీలలోహిత కిరణాలు, కృతిమ వెలుగులు కంటికి హాని చేయకుండా కాపాడతాయి

ఈ బియ్యంలో ప్రొటీన్లూ, పీచూ వల్ల అతిగా తినే అలవాటు అదుపులో ఉంటుంది. ఫలితంగా బరువూ తగ్గొచ్చు. నల్లబియ్యంలో యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ డ్యామేజ్‌నూ, కొలెస్టాల్ర్‌, ట్రైగ్లిజరైడ్‌ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని బలపరుస్తాయి