వాములో విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. నియాసిన్, థయామిన్, సోడియం, పాస్ఫరస్, పొటాషియం, కాల్షియంలు ఉంటాయి. వీటితో పాటు కార్బోహైడ్రేట్స్, ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్స్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.
వాములో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ గుణాలు ఉన్నాయి. ఇవి ఆర్థరైటిస్ వంటి సమస్యల్ని తగ్గిస్తాయి. దీంతో ఎరుపుదనం, వాపు, కీళ్ళలో నొప్పులు తగ్గుతాయి.
వాములో థైమోల్ ఉంటుంది. ఈ గింజల్ని తీసుకోవడం వల్ల బీపి కంట్రోల్ అవుతుంది. అధ్యయనం ప్రకారం వాముని తీసుకోవడం బీపి కంట్రోల్ అవ్వడమే కాకుండా, గుండె కణాలని ఆరోగ్యంగా ఉంచుతుంది.
వాముని తీసుకోవడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. వాములో ఎక్కువగా డైటరీ ఫైబర్స్, ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. ఇవి మంచి కొలెస్ట్రాల్ లెవల్స్‌ని పెంచుతాయి.
వర్షాకాలంలో చాలా మందికి జలుబు అవుతుంది. దీని వల్ల ముక్కు మూసుకుపోతుంది. ఇలాంటి సమస్యని వాము దూరం చేస్తుంది. దీనిని వాడడం వల్ల ఆస్తమా వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
కొన్ని వాము గింజల్ని తీసుకుని క్రష్ చేసుకుని ఇందులో కొద్దిగా బెల్లం కలిపి నమిలి తింటే ప్రయోజనం ఉంటుంది. రోజుకి 2 నుంచి 3 సార్లు ఇలా చేస్తే దీని వల్ల జలుబు తగ్గుతుంది.
చాలా మంది కడుపుకి సంబంధించిన సమస్యలతో బాధపడతారు. అలాంటివారికి వాము చక్కని ఔషధంగా పనిచేస్తుంది. ఇవి కొన్నిఎంజైమ్స్‌ని, జీర్ణ రసాలని విడుదల చేసి జీర్ణ సమస్యల్ని దూరం చేస్తాయి.
వాములో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఎక్కువగా తీసుకోవడం అంత మంచిది కాదు. రోజుకి 2 స్పూన్ల పరిమాణం కంటే ఎక్కువగా వాడితే సమస్యలొస్తాయని గుర్తుంచుకోండి.