రవి అస్తమించని దేశాలు..

TV9 Telugu

28 May 2024

సూర్యుడు అస్త‌మించ‌ని ప్రాంతాలు కొన్ని ఉన్నాయ‌న్న సంగ‌తి మీకు తెలుసా. అర్ధ‌రాత్రి కూడా అక్క‌డ ప‌ట్ట‌ప‌గల్లాగానే ఉంటుంది.

నార్వేలోని స్వాల్ బార్డ్‌లో ఏప్రిల్ 10 నుంచి ఆగ‌స్టు 23 వ‌ర‌కు సూర్యుడు నిరంత‌రం ప్ర‌కాశిస్తూనే ఉంటాడు.

ఫిన్లాండ్‌ దేశంలో ఎండాకాలంలో 70 రోజుల పాటు సూర్యుడు అస‌లు అస్త‌మించ‌డు. అర్ధ‌రాత్రి కూడా ప‌ట్ట‌ప‌గ‌ల్లాగే ఉండటం అక్కడ విశేషం.

యూర‌ప్‌లో ఉన్న అతిపెద్ద ద్వీపం ఐస్‌లాండ్‌. అక్క‌డ జూన్ నెల‌లో సూర్యుడు అస్త‌మించడు. ఆ నెల రోజులు ప‌గ‌లు, రాత్రికి తేడా ఉండ‌దు.

కెనడాలోని యుకోన్‌లో ఏడాది పొడ‌వునా మంచు కురుస్తుంది. 50 రోజులు మాత్రం ఉండే వేస‌వి కాలంలో అర్ధ‌రాత్రి కూడా సూర్యుడు ఉంటాడు.

స్వీడ‌న్‌లోని కిరున్ న‌గ‌రంలో ఏడాదిలో మే నుంచి ఆగ‌స్టు మ‌ధ్య‌లో దాదాపు వంద రోజుల పాటు సూర్యుడు అస్త‌మించ‌డు.

అమెరికాకు చెందిన‌ అలాస్కాలోని బారోలో మే నుంచి జూలై వ‌ర‌కు సూర్యుడు అస్త‌మించ‌డు. అర్ధ‌రాత్రి కూడా వెలుగులు విర‌జిమ్ముతూనే ఉంటాడు.

గ్రీన్‌లాండ్‌లో ఉత్త‌రంవైపు ఉండే కానాక్ న‌గ‌రంలోని వేస‌వికాలంలో ఏప్రిల్ నుంచి ఆగ‌స్టు మ‌ధ్య మాత్రం సూర్యుడు రోజంతా ప్ర‌కాశిస్తూనే ఉంటాడు.