ఫ్యూచర్‌లో ఎండ తీవ్రత సమస్య ఉండకపోవచ్చు..

TV9 Telugu

07 April 2024

పెరుగుతున్న ఎండాకాలం ఉష్ణోగ్రతల కారణంగా జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. బయట తిరగడానికి కూడా భయపడుతున్నారు.

పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతలను తగ్గించేందుకు కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు అమెరికా శాస్త్రవేత్తలు.

జియోఇంజినీరింగ్‌ సాంకేతికతతో మేఘాలను మరింత ప్రకాశవంతంగా మార్చి సూర్యరశ్మిని తిరిగి ఆకాశంలోకే వికర్షించనున్నారు.

మెరైన్‌ క్లౌడ్‌ బ్రైటెనింగ్‌ కోసం ముందుగా మహాసముద్రంపై దిగువ వాతావరణంలో సముద్రపు ఉప్పు లేదా ఏరోసోల్‌లను స్ప్రే చేస్తారు.

క్లౌడ్‌ బ్రైటెనింగ్‌ మేఘాలను మరింత ప్రకాశవంతంగా మార్చే కేంద్రకాలుగా పని చేస్తాయని శాస్త్రవేత్తలు ధీమాగా ఉన్నారు.

సూర్యరశ్మిని వికర్షించే సామర్థ్యం పెరుగుతుందని తద్వారా భూమిపై ఉష్ణోగ్రతలను తగ్గించే అవకాశం ఉందంటున్నారు.

ఈ మేరకు అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో బేలో మొదటి ప్రయోగం చేశారు. అయితే ఈ పద్ధతిపై పలు విమర్శలు కూడా ఉన్నాయి.

వాతావరణాన్ని ప్రభావితం చేసే ఈ పద్ధతి వల్ల దుష్ప్రభావాలు ఉండే ప్రమాదం ఉందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు.