పోషకాల నిధి 'పొద్దు తిరుగుడు'తో ఈ భయంకర వ్యాధికి దివ్యౌషధం..!

Jyothi Gadda

05 July 2024

పొద్దు తిరుగుడు గింజలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిలో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవన్నీ శరీరానికి కావాల్సిన శక్తిని అందించి రోగనిరోధకతను పెంచుతాయి. ఫలితంగా వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. 

 ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తాయి. వీటిలో ఫైబర్ కొలెస్ట్రాల్ తగ్గేందుకు సహకరిస్తుంది. జీర్ణశక్తిని పెంచుతాయి. ఈ సీడ్స్‌లో డైటరీ ఫైబర్ మల బద్ధకాన్ని నివారిస్తుంది.

క్యాన్సర్‌ను అడ్డుకుంటాయి. ఈ విత్తనాల్లోని విటమిన్ E, సెలెనియం,కాపర్‌కి విష వ్యర్థాల్ని అడ్డుకునే శక్తి ఉంది. ఇవి కణాలు దెబ్బ తినకుండా కాపాడతాయి. కొలన్ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ సోకకుండా చేస్తాయి.

ఇవి ముకలకు పుష్టి. ఈ విత్తనాల్లో ఉండే మెగ్నీషియం ఎముకలు గట్టిపడేందుకు ఉపయోగపడుతుంది. ఎముకల జాయింట్లు బాగా పనిచేసేలా ఈ గింజల్లోని కాపర్ సహకరిస్తుంది. కండరాలు పట్టేయకుండా కాపాడుతాయి.

సన్ ఫ్లవర్ విత్తనాల్లోని మెగ్నీషియం మన నరాలకు రిలాక్స్ ఇస్తుంది.మన మూడ్‌ పాజిటివ్‌గా ఉండేలా చేస్తాయి ఈ విత్తనాలు. ఒత్తిడి తగ్గిస్తాయి. మెంటల్ హెల్త్‌ని మెరుగ్గా ఉంచుతాయి.

శ్వాస తీసుకోవడం తేలిక. ఆయుర్వేదంలో ఈ విషయం స్పష్టంగా ఉంది. సన్‌ఫ్లవర్ సీడ్స్ మన ఊపిరి తిత్తులను బాగు చేస్తాయి. ఊపిరి పీల్చేటప్పుడు, వదిలేటప్పుడూ ఎదురయ్యే సమస్యల్ని నయం చేస్తాయి.

రకరకాల ఇన్ఫెక్షన్ల నుంచీ పిల్లల్ని కాపాడేందుకు ఈ సీడ్స్ ఉపయోగపడతాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. ఎందుకంటే ఈ గింజల్లో కావాల్సినంత జింక్ ఉంటుంది. ఇది గాయాల్ని తగ్గిస్తుంది.

ముసలితనం రాకుండా చెయ్యడంలో ఈ గింజలు ఎంతో మేలు చేస్తాయి. చర్మం మెరిసేలా చేస్తుంది. హెయిర్ లాస్‌ను అరికట్టవచ్చు. జుట్టు తెల్లబడే సమస్యకు కూడా ఈ గింజలు చక్కటి పరిష్కారం అవుతాయి.