అప్పుడే ఎంత వేడి దంచేస్తోంది! ఈ ఎండలో రోజూ కొద్దిసేపు అలా బయటికి వెళ్లొచ్చినా చర్మం వెంటనే రంగు మారిపోతుంది
దీంతో చర్మానికి అప్పుడే ట్యాన్ పట్టేసిందని తెగ బాధపడిపోతుంటాం. కానీ చర్మకణాలను యూవీ కిరణాల బారి నుంచి రక్షించే ప్రక్రియే ఇది
ఎంత మంచిదైనా చర్మం నులపు, కందినట్లు ఎరుపు రంగుల్లోకి మారిపోయి కనిపిస్తోంటే ఏం బాగుంటుంది? ట్యాన్‌ని తేలిగ్గా పోగొట్టుకునే ఈ చిట్కాలను పాటిస్తే పరేషాన్ అక్కర్లేదు
బంగాళదుంపను సన్నని చక్రాలుగా కోసి, సమస్య ఉన్నచోట వాటితో ముఖంపై రుద్దండి. దీనిలోని క్యాటకోలేజ్ అనే ఎంజైమ్ ట్యాన్‌ను తగ్గిస్తుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్‌తో పోరాడతాయి
అలాగే పైనాపిల్ ముక్కను తీసుకొని మెత్తగా గుజ్జులా చేసుకోవాలి. దానిలో చెంచా తేనె కలిపి, ట్యాన్ ఉన్న ప్రదేశంలో పూతలా వేసుకోవాలి
ఇరవై నిమిషాలయ్యాక చల్లని నీటితో కడిగేస్తే సరిపోతుంది. దీనిలోని ఎ, సి విటమిన్లు దెబ్బతిన్న చర్మకణాలను పునరుత్తేజం పొందేలా చేస్తాయి
స్ట్రాబెర్రీలో ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్లు ఉంటాయి. వీటిని తాజా క్రీమ్‌తో కలిపి, మెత్తగా మిక్సీ చేసుకుని.. ఆ మిశ్రమాన్ని చర్మం రంగుమారిన చోట రాసుకోవాలి
20 నిమిషాలపాటు ఆరనిచ్చి, ఆ తర్వాత చల్లని నీటితో కడిగేస్తే సరి. రంగు మెరుగవడమే కాదు, చర్మానికి కావాల్సిన తేమా అందుతుంది. చర్మం తిరిగి నిగారింపు సంతరించుకుంటుంది