నెల రోజుల పాటు పుచ్చకాయ తింటే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో 

 03 April 2024

TV9 Telugu

Pic credit - Pexels

వేసవి కాలం పుచ్చకాయల కాలం. దీన్ని తినడం వల్ల శరీరంలో నీటి కొరత తీరుతుంది. ఇందులో 90 శాతం నీరు ఉంటుంది

వేసవి పండు

పుచ్చకాయలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పరిగణించబడతాయి.

పోషకాలు మెండు 

పుచ్చకాయతో చేసిన రసం లేదా ఇతర వంటకాలను కూడా తినవచ్చు. ఇలా నెల రోజులు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

ఆరోగ్యానికి మేలు  

పుచ్చకాయ తింటే బరువు తగ్గుతారు. పుచ్చకాయ తీపి పండు అయినప్పటికీ.. దీనిలో కేలరీల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది.

బరువు తగ్గుతారు 

పుచ్చకాయలో చాలా నీరు ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో వేసవిలో పుచ్చకాయను తీసుకోవడం ద్వారా శరీరంలో నీటి కొరతను భర్తీ చేసుకోవచ్చు.

హైడ్రేటెడ్ గా ఉంచుతుంది 

పుచ్చకాయ తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. పుచ్చకాయలో అధిక మొత్తంలో పొటాషియం, మెగ్నీషియం ఉన్నాయి. రక్తపోటును నియంత్రిస్తుంది.

రక్తపోటు

ఇందులో విటమిన్ సి, విటమిన్ ఎ ఉంటాయి. దీని కారణంగా కొల్లాజెన్ ఏర్పడుతుంది. ఇది జుట్టు, చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

జుట్టు, చర్మం

పుచ్చకాయలో ఎల్-సిట్రుల్లైన్ ఉంటుంది. ఇది కండరాల నొప్పులను తగ్గిస్తుంది. శారీరక పనితీరును మెరుగుపరిచి కండరాలను బలంగా మారుస్తుంది.

కండరాలకు బలం

రక్తంలో యూరిక్ యాసిడ్ పరిమాణాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా మూత్రపిండాల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

మూత్రపిండాల సమస్యలకు