వేసవిలో కాసేపు ఎండలోకి వెళ్లివస్తే ముఖమే కాదు... జుట్టూ పాడవుతుంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి నువ్వుల నూనెవాడితే చక్కని పరిష్కారం దొరుకుందని అంటున్నారు నిపుణులు
TV9 Telugu
సూర్యుడి నుంచి వెలువడే యూవీ కిరణాల నుంచి నువ్వుల నూనె జుట్టుకి రక్షణ కల్పిస్తుంది. జుట్టుకు మేలు చేసే ఎన్నో పోషకాలు నువ్వుల నూనెలో పుష్కలంగా ఉంటాయి
TV9 Telugu
ముఖ్యంగా ఇందులో ఉండే ఒమెగా ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం, మెగ్నీషియం వంటివి మాడుని చల్లబరిచి ఒత్తిడిని తగ్గించడంలో సాయపడతాయి
TV9 Telugu
పావుకప్పు నువ్వుల నూనె వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు మాడు నుంచి చివర్ల వరకూ పట్టించాలి. గంటాగి గాఢత తక్కువగల షాంపూతో తలస్నానం చేస్తే సరి
TV9 Telugu
మాడుమీద పుండ్లు, దురద, చుండ్రు, ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఉంటే.. నువ్వులనూనె, వేప నూనెలను సమాన పరిమాణంలో కలిపి తలకు రాసుకోవాలి
TV9 Telugu
కాసేపు మర్దనా చేసి ఆపై రసాయనాలు లేని షాంపూతో తలస్నానం చేస్తే సరి. వీటిల్లో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి
TV9 Telugu
జుట్టు కుదుళ్లు బలంగా ఉండాలంటే పోషకాహారం తీసుకోవాలి. అప్పుడే కురులు బలంగా ఉంటాయి. ముఖ్యంగా పప్పుల్లోని మాంసకృత్తులు, ఇనుము జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి
TV9 Telugu
చిలగడ దుంపలో విటమిన్-ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది మాడుపై తైలగ్రంథుల పనితీరును మెరుగుపరుస్తుంది. దాంతో జుట్టు కాంతివంతంగా కనిపించడంతోపాటు బలంగా మారుస్తాయి