ఇలాంటి వారు పొరపాటున కూడా చెరుకు రసం తాగరాదు 

24 May 2024

TV9 Telugu

Pic credit - getty

వేసవిలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచే అత్యంత ప్రజాదరణ పొందిన పానీయాలలో చెరకు రసం ఒకటి. నగరాల్లో పల్లెల్లో వీధుల్లో చెరుకు రసం అమ్మే దుకాణం కనిపిస్తుంది

వేసవి పానీయం

పొటాషియం, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, రైబోఫ్లావిన్, అమైనో ఆమ్లాలు, థయామిన్, జింక్ వంటి పోషకాలు చెరకులో ఉంటాయి.

చెరకులో పోషకాలు

చెరకు రసం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉన్నప్పటికీ, కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు చెరకు రసం తాగడం మానుకోవాలి.

చెరకురసం వినియోగం

డయాబెటిస్‌తో బాధపడేవారికి షుగర్ లెవెల్ పెరుగుతూనే ఉంటుంది. కనుక మధుమేహ వ్యాధిగ్రస్తులు చెరకు రసాన్ని తీసుకోకుండా ఉండాలి.

మధుమేహం

స్థూలకాయంతో బాధపడేవారు, బరువు తగ్గాలనుకునేవారు చెరకు రసాన్ని ఎక్కువగా తీసుకోకూడదు.

ఊబకాయం సమస్య

జలుబు, దగ్గుతో బాధపడేవారు కూడా చెరకు రసం తాగకుండా ఉండాలి. ఎందుకంటే ఇది శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది.

జలుబు, దగ్గు

బలహీనమైన జీర్ణ సామర్థ్యం ఉన్నవారు చెరకు రసాన్ని ఎక్కువగా తీసుకోవడం మానుకోవాలి. లేకుంటే వారు డయేరియా సమస్యను ఎదుర్కొంటారు.

బలహీనమైన జీర్ణక్రియ