మధ్యాహ్నం పూట ఓ గ్లాసు చల్లని చెరకు రసం తాగితే ఆ హాయి మాటల్లో చెప్పలేం. క్షణాల్లో శరీరం ఉత్తేజితమవుతుంది. ఇందులోని చక్కెరలు, పోషక ఖనిజాలే అందుకు కారణం
TV9 Telugu
చెరకులో పిండిపదార్థాలు, మాంసకృత్తులతోపాటు పొటాషియం, జింక్, ఫాస్ఫరస్, క్యాల్షియం, ఐరన్ లాంటి ఖనిజాలుంటాయి. విటమిన్-ఎ, బి, సి కూడా ఎక్కువే
TV9 Telugu
చెరకు రసంలో పీచు ఉంటుంది. ఇది శరీరంలో బరువు పెరగడాన్ని నివారిస్తుంది. శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది
TV9 Telugu
ఇది అలసట, నిస్సత్తువను తగ్గించి తక్షణ శక్తిని అందిస్తుంది. శరీరాన్ని రీహైడ్రేట్ చేస్తుంది. ఇందులోని ఖనిజాలు దంతాలు, ఎముకలకు బలాన్నిస్తాయి. మలబద్ధకాన్ని పారదోలుతుంది
TV9 Telugu
క్రమం తప్పకుండా తాగితే రోగనిరోధకత పెరుగుతుంది. దీంట్లోని ఫ్లేవనాయిడ్స్, యాంటీఆక్సిడెంట్లు, ఇతర ఫెనోలిక్ సమ్మేళనాలు వృద్ధాప్య ఛాయలు రాకుండా అడ్డుకుంటాయి
TV9 Telugu
డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. చెరకు రసం దంతాలను బలపరుస్తుంది. ఇది దంత క్షయాన్ని కూడా నివారిస్తుంది
TV9 Telugu
కడుపు సంబంధిత సమస్యలతో బాధపడేవారు చెరుకు రసం తాగడం వల్ల ఉపశమనం పొందవచ్చు. ఈ జ్యూస్‌ని రెగ్యులర్‌గా తాగడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రిస్క్ కూడా తగ్గుతుంది
TV9 Telugu
ఇందులో పీచు సమృద్ధిగా ఉండటంవల్ల.. దీన్ని తాగిన వెంటనే పొట్ట నిండిన భావన కలిగి ఆకలి వేయదు. బరువు తగ్గాలనుకునే వారికి చక్కని ఎంపిక. కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది