పండుగ సీజన్‌లో మీ సంబరాలను మరింత పెంచడానికి రుచికరమైన ఆరోగ్యకరమైన స్వీట్లు చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఇంట్లోనే చక్కెర లేకుండా రుచికరంగా కొబ్బరి లడ్డూ తయారు చేసుకోండి
TV9 Telugu
కొబ్బరి లడ్డూ చేయడానికి రెండు కప్పుల తురిమిన కొబ్బరి, ఒక కప్పు నానాబెట్టిన ఖర్జూరం, 1/4 కప్పు బాదం లేదా జీడిపప్పు, అర టీ స్పూన్ యలకుల పొడి,1-2 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకోవాలి
TV9 Telugu
నానబెట్టిన ఖర్జూరాలను గింజలను తీసి మిక్సీలో వేసి మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఇది సహజ స్వీటెనర్‌గా ఉపయోగపడుతుంది
TV9 Telugu
ఇప్పుడు తురిమిన కొబ్బరిని 3-4 నిమిషాల పాటు సన్నని వేడిమీద తేలికపాటి వాసన వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని వేయించాలి
TV9 Telugu
రుచి కోసం యాలకుల పొడి, నెయ్యి కొబ్బరి తురుములో కలపాలి. మిశ్రమం చిక్కబడే వరకూ కదిలిస్తూ ఉండాలి. ఆ తర్వాత చేతులకు కొంచెం నెయ్యి రాసుకుని చిన్న చిన్న లడ్డూలుగా తయారు చేసుకోవాలి
TV9 Telugu
లడ్డూలను తయారు చేసిన తర్వాత వాటిని ఓ ప్లేట్‌లో పెట్టి, కొద్ది సేపటివరకూ అంటే చల్లారేంత వరకూ పక్కన పెట్టుకోవాలి. అంతే ఈ పండగ సీజన్‌లో ఆరోగ్యకరమైన కొబ్బరి లడ్డూలు తయారైనట్లే
TV9 Telugu
ఈ వంటకం యూట్యూబ్ ఛానెల్‌లో కూడా అందుబాటులో ఉంది. హెచ్చర్స్ కిచెన్ అని యూట్యూబ్‌లో టైప్ చేస్తే ఈ లడ్డూ తయారీ వీడియో వస్తుంది
TV9 Telugu
ఇంకేం సంప్రదాయ పండుగలూ పెళ్లి వేడుకల్లో వెరైటీగా ఈ లడ్డూలు చేసి అతిథుల్ని చకితుల్ని చేయాలనుకుంటే వీటిని వెంటనే తయారు చేసేయండి. కేవలం విందు భోజనాల్లోనే కాదు, కానుకలుగా ఇచ్చే స్వీటుగా కూడా దీనిని వినియోగించవచ్చు