ఆల్కహాల్ తాగడం సడన్ గా మానేస్తే కొందరిలో తీవ్రమైన సమస్యలు కనిపిస్తాయి. దీనినే విత్‌డ్రాయల్ సిండ్రోమ్ అని పిలుస్తారు.
అయితే మద్యం హఠాత్తుగా మానేస్తే కొంతమందిలో టెన్షన్, అలసట కనిపిస్తాయి. కొన్నేళ్లు మద్యం తాగి మానేస్తే మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.
కొంతమంది మద్యం తాగడం మానిస్తే చెవుల్లో పెద్ద శబ్దాలు వినిపిస్తున్నాయట.. అంతే కాదు ఎవరో తమను పిలుస్తున్నట్టు కూడా అనిపిస్తుందట. దీనినే ఆల్కహాల్ ప్రేరేపిత బ్రాంతి అంటారు.
ఏళ్ల తరబడి మద్యం తాగి.. ఏదో ఒక కారణంతో తాగడం మానేస్తే వారిలో మూడు రోజుల్లోపు మానసిక సమస్యలు తలెత్తుతాయి. కోపం, ముందు ఏం ఉందో తెలియని పరిస్థితి, అయోమయంలోకి వెళ్తారు.
చాలా మంది సరైన ఆహారం తీసుకోకుండా రేయింబవళ్లు మద్యం తాగుతుంటారు. అలాంటి వారిలో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. కామెర్లు రక్తం గడ్డకట్టడంతో పాటు మెదడు కణజాలాన్ని ప్రభావితం చేస్తుంది.
షడన్ గా ఆల్కహాల్ మానేయడం వల్ల వచ్చే మానసిక సమస్యలు పెరిగితే ఆ తర్వాతి దశలో అది న్యూరోలాజికల్ సమస్యలకు దారితీస్తుంది. ఈ దశలో వారు అన్నింటినీ మర్చిపోతుంటారు.
తమకు మతిమరుపు ఉందనే విషయాన్ని చెప్పకుండా ఏదో ఒకటి చెప్పేందుకు ప్రయత్నిస్తుంటారు. దీనికి తోడు నరాలకు సంబంధించిన సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది.
ఆల్కహాల్ తీసుకోవడం మానేయాలనుకొనే వారు క్రమేణ తగ్గించుకుంటూ రావాలి. ఒక నెల పాటు వారానికి రెండు సార్లు.. వారానికోసారి తగ్గించుకుంటే వస్తే శరీరంపై ఎలాంటి దుష్ప్రభవాలు ఉండవు.