పిల్లలు ఎదిగే క్రమంలో పలు దశలను దాటుతుంటారు. ఇందులో మాటలు నేర్చుకోవడం, మాట్లాడడం కూడా ప్రధానమైనది. అయితే కొంతమంది పిల్లలు ఈ దశను సరిగ్గా దాటలేకపోతుంటారు
ఈ క్రమంలో మాట్లాడేటప్పుడు నత్తి, తడబాటు వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటిని ‘లాంగ్వేజ్ డిజార్డర్’ అని అంటారు. నిజానికి నత్తి అనేది పిల్లల్లో పలు కారణాల వల్ల వస్తుంటుంది
కొంతమందిలో జన్యుపరంగా ఈ సమస్య వస్తుంటుంది. పిల్లల తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా నత్తి ఉంటే పిల్లలకు కూడా వస్తుంటుంది
మరికొంతమందిలో గందరగోళం వల్ల కూడా నత్తి వస్తుంటుంది. అంటే ఇంట్లో మాతృభాష మాట్లాడడం, బయట మరో భాష మాట్లాడడం వల్ల పిల్లలు గందరగోళానికి గురవుతుంటారు
చాలామందిలో మాత్రం నలుగురిలోకి వెళ్లకపోవడం (సోషల్ ఇంటరాక్షన్ లేకపోవడం) వల్ల నత్తి వస్తుంటుంది. ఇంట్లో తోబుట్టువులు లేకపోవడం, గ్రాండ్ పేరెంట్స్‌కి దూరంగా ఉండడం, ఇతరులతో ఎక్కువగా కలవకపోవడం ఇందుకు కారణాలు
పిల్లల్లో నత్తి నివారణకు స్పీచ్ థెరపీ వంటివి ఇప్పిస్తే చాలా వరకు నత్తి సమస్యను తగ్గించుకోవచ్చు. చాలా కొద్దిమందిలో నాలుక మందంగా ఉండడం వల్ల నత్తి వస్తుంటుంది
ఇలాంటివారికి తగిన చికిత్స అందించడం వల్ల సమస్యను దూరం చేయచ్చు. మాట్లాడే మాటల్లో స్పష్టత లేకపోవడం, వేగంగా మాట్లాడడం, ఏదో ఒకటి త్వరగా మాట్లాడాలి అనుకోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంటుంది
ప్రాక్టీస్ ద్వారా తడబాటు, నత్తి సమస్యలను నయం చేసుకోవచ్చు. ఇలాంటి సమయాల్లో పిల్లలు మాట్లాడుతున్నప్పుడు తప్పులను ఎత్తి చూపకుండా రోజుకు 10 పదాలను లక్ష్యంగా పెట్టుకుని ప్రాక్టీస్ చేయిస్తే క్రమంగా నత్తి నయం అవుతుంది