పరీక్షల్లో మార్కులు సాధించాలంటే ఇలా చదవండి..

March 18, 2024

TV9 Telugu

ప్రస్తుతం అటు విద్యార్ధులకు, ఇటు ఉద్యోగార్ధులకు సంక్లిష్ట సమయం. వరుస పరీక్షలు ఉండటంతో అంతా పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు

ఒక్కోసారి పరీక్షలకు ఎంత బాగా చదివినా మార్కులు మాత్రం ఊహించని విధంగా అంతంత మాత్రంగానే ఎత్తెసురు మార్కులు వస్తుంటాయి

కొందరు సమాయాన్ని ఏ మాత్రం వృధా చేయకుండా చదివినా ఫలితం దక్కడం లేదని కొందరు విద్యార్ధులు వాపోతుంటారు

నిజానికి ఎవరికి వారు చదువుకోవడం మామూలే. కానీ గ్రూప్‌ స్టడీలో పాల్గొనడం వల్ల మరింత ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు నిపుణులు

ఒంటరిగా చదువుతున్నప్పుడు ఏదో మొక్కుబడిగా చదువుతూ బోర్‌గా ఫీలవుతుంటారు. కొన్ని సబ్జెక్టులు ఇంకెప్పుడైనా చదువుదాం అని వాయిదా వేస్తుంటారు

అదే స్నేహితులతో కలిసి గ్రూప్‌ స్టడీ చేయండి.. ఎంతో ఉత్సాహం చూపిస్తారు. దీనివల్ల వాయిదా విధానాన్ని మానుకుంటారు. పైగా డౌట్స్‌ వచ్చినా వెంటనే క్లియర్‌ చేసుకోవచ్చు

కలిసి చదవడంవల్ల బృంద స్ఫూర్తి ఏర్పడుతుంది. నలుగురిలో కలిసేందుకు సిగ్గుపడేవారైతే స్నేహితులతో చదవడమే మంచిది. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ కూడా పెరుగుతాయి

అలాగే నాయకత్వ లక్షణాలు అలవడతాయి.ఎవరికి వారు చదువుకునేటప్పుడు తాము చదివిందే కర్టెక్‌ అనుకుంటారు. దానివల్ల పరీక్షలో తప్పుడు సమాధానాలు రాసే అవకాశం ఉంది