నిద్రకు, ఆల్కహాల్‌కు  మధ్య సంబంధం.. 

09 January 2024

TV9 Telugu

ఆల్కహాల్ సేవించిన వెంటనే మత్తులో నిద్ర వస్తుంది. దీంతో హాయిగా నిద్ర పడుతుందని అంతా భావిస్తారు. కానీ ఇందులో నిజం లేదని నిపుణులు చెబుతున్నారు. 

సాయంత్రం, రాత్రి సమయాల్లో ఆల్కహాల్‌ తీసుకుంటే అది నిద్ర నాణ్యతపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. 

మద్యం తీసుకుంటే త్వరగా నిద్ర వచ్చిన భావన కలిగినా.. రాత్రంతా ప‌లుమార్లు నిద్రా భంగం క‌లిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

ఆల్క‌హాల్ తీసుకోవ‌డం ద్వారా గాఢ నిద్ర‌ను కోల్పోతున్నార‌ని పరిశోధనల్లో వెల్లడైంది. ఆల్కహాల్‌ ప్రభావం తగ్గగానే కొందరు త్వరగా మేల్కొని ఆపై తిరిగి నిద్రపోవడంలో ఇబ్బందిపడతారని తేలింది. 

నెల రోజుల పాటు మద్యానికి దూరంగా ఉన్న వారిలో నిద్ర మెరుగుప‌డింద‌ని పరిశోధకుల పరిశోధనల్లో వెల్ల‌డైంది. ఇందుకోసం కొందరిని పరగిణలోకి తీసుకున్నారు. 

బ్రిట‌న్‌లో డ్రై జ‌న‌వ‌రి ఛాలెంజ్‌లో పాల్గొన్న 4000 మందిపై ఈ పరిశోధ‌న చేప‌ట్టారు. ఆల్క‌హాల్ తీసుకోకుంటే నిద్ర ప‌రిస్ధితి మెరుగైంద‌ని 56 శాతం మంది వెల్ల‌డించారు.

రాత్రి ప‌డుకునే ముందు మ‌ద్యం తీసుకుంటే నిద్ర‌కు విఘాతం క‌లిగిస్తుంద‌ని నిపుణులు తేల్చిచెప్పారు. ఉదయం కంటే రాత్రి తీసుకునే ఆల్కహాల్‌ ప్రభావం ఎక్కువ చూపుతుందన్నారు. 

మద్యం అలవాటును మానుకోవడం ద్వారా నిద్ర నాణ్యతను పెంచుకోవచ్చని, మద్యం అలవాటు ఉన్న వారు దశల వారీగా ఆ అలవాటును మానుకోవాలని సూచిస్తున్నారు.