వింత ఆచారం.. అక్కడ ఆడపిల్ల పుడితే ఎర్రచందనం మొక్క నాటాల్సిందే..!
29 September 2025
Prudvi Battula
భిన్నత్వంలో ఏకత్యం టక్కున గుర్తు వచ్చేది భారతదేశం పేరే. విభిన్న సంప్రదాయాలు, ఆచారాలకు పుట్టినిల్లు మన దేశం.
భరత్లోని పకౌలి అనే గ్రామంలో ఎవరికైనా ఆడపిల్ల పుడితే ఎర్రచందనం మొక్క నాటాలనే వింత ఆచారన్ని పాటిస్తున్నారు.
దేశంలో బిహార్ రాష్ట్రంలోని వైశాలి జిల్లా పకౌలి గ్రామంలో ఆడబిడ్డ పుడితే పండగగా భావించి సంబరాలు చేసుకుంటారు.
పుట్టిన ఆడపిల్లకి గుర్తుగా ఇక్కడ గ్రామస్థులు ఎర్రచందనం మొక్కను నాటుతారు. ఈ ఆచారాన్ని గ్రామంలో అందరు పాటిస్తారు.
ఆడ బిడ్డతోపాటనే ఎర్రచందనం మొక్క కూడా ఎదుగుతుంది. ఆమె వివాహ ఖర్చులకు ఈ చెట్టును విక్రయించడం జరుగుతుంది.
స్థానిక ప్రజలు కూడా గంధపు చెక్కను శుభప్రదంగా నమ్ముతారు. దీన్ని అమ్మి వచ్చిన డబ్బుతో పెళ్లి చేస్తే ఆడపిల్ల సంతోషంగా ఉంటుందని నమ్ముతారు.
పకౌలి గ్రామం పట్నాకు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ 700 ఇళ్లల్లో 4,000 మంది జనాభా నివాసం ఉంటున్నారు.
దాదాపు ఇక్కడ ప్రతి ఇంటి ముందూ ఓ ఎర్ర చందనం చెట్టు కచ్చితంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ గ్రామంలో మొత్తం 900 చెట్లున్నాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ మొక్కలు ఉంటే.. ఇంటికి అరిష్టం.. వెంటనే తొలగించండి..
రోజుకు ఒక గ్లాస్ పైనాపిల్ జ్యూస్.. ఆ సమస్యలన్నీ ఖతం..
చేప తల తింటే.. అన్లిమిటెడ్ బెనిఫిట్స్