ఆహారాన్ని ఫ్రిజ్‌లో ఉంచేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?

30 August 2024

TV9 Telugu

TV9 Telugu

మారుతోన్న కాలానికి అనుగుణంగా మనలో చాలామంది ఇళ్లలో ఫ్రిజ్‌ వాడకం పెరిగింది. తాజా పండ్లూ, కూరగాయలూ, పాలు, మిగిలిన కూరలేవైనా సరే... మొదట వెళ్లేది ఫ్రిజ్‌లోకే 

TV9 Telugu

ఫ్రిజ్ లేకుండా ఒక్కరోజు కూడా గడవని పరిస్థితికి వచ్చేశాం. వండిన ఆహారమైనా, వండనిదైనా సరే... ఫ్రిజ్‌లో పెడితే అందులోని పోషకాలు పాడయ్యి బ్యాక్టీరియా వృద్ధిచెందే అవకాశమూ ఎక్కువే. తద్వారా రోగనిరోధక శక్తి తగ్గిపోయి వ్యాధుల బారినపడతాం

TV9 Telugu

తరచుగా రిఫ్రిజిరేటర్లలో అన్ని రకాల ఆహారాలను ఉంచుతాం. కానీ రిఫ్రిజిరేటర్‌లో ఉంచినప్పటికీ, కట్ చేసిన పండ్లు, పచ్చి మాంసం, కూరగాయలు బ్యాక్టీరియా, క్రిములు వృద్ధి చెందుతుంటాయి

TV9 Telugu

ఈ బాక్టీరియా, జెర్మ్స్ అన్నీ ఉడికించిన తర్వాత కూడా తొలగిపోవు. దీని వల్ల పొట్ట సమస్యలు, అలర్జీలు తలెత్తుతాయి. ఈ సమస్య రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా

TV9 Telugu

మార్కెట్ నుంచి తెచ్చిన మాంసాన్ని కడిగి.. ఫ్రిల్‌లో దాచుతున్నారా? ఈ తప్పు చేయవద్దు. పచ్చి మాంసాన్ని నేరుగా ఫ్రిజ్‌లో ఉంచాలి. వంట చేయడానికి ముందు కడిగితే సరిపోతుంది

TV9 Telugu

ఉడికించిన బంగాళాదుంపలను వాటి తొక్కలతో ఫ్రిజ్‌లో ఉంచకూడదు. ఇది బ్యాక్టీరియా పెరుగుదలకు కారణమవుతుంది. ఉడికించిన బంగాళాదుంపలను రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేసేటప్పుడు ఈ తప్పు చేయకండి

TV9 Telugu

వండిన అన్నాన్ని చల్లబరచకుండా ఫ్రిజ్‌లో ఉంచవద్దు. బియ్యంలో స్టార్చ్ ఉంటుంది. వేడి పిండి పదార్ధాలు బ్యాక్టీరియా కంటెంట్‌ను వేగంగా పెంచుతాయి. అందుకే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి

TV9 Telugu

అలాగే వేడి ఆహారాన్ని చల్లబరచకుండా రిఫ్రిజిరేటర్‌లో ఉంచినా బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ తప్పు చేయవద్దు. ఫ్రిజ్‌లో ఉంచిన మాంసాన్ని నేరుగా వంట చేయకూడదు. కాసేపు బయట ఉంచాలి