13 June 2024

ఎక్కువ రోజులు బతకాలని  ఉందా.? ఇలా చేయండి.. 

Narender.Vaitla

ఎక్కువ కాలం జీవించాలనుకునే వారు కచ్చితంగా స్మోకింగ్‌కు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. స్మోకింగ్‌ మీ జీవిత కాలాన్ని క్రమంగా తగ్గిస్తుంది.

గంటలతరబడి కదలకుండా ఒకే చోట కూర్చోవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని. ఇవి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి అటుఇటు నడవడం అలవాటు చేసుకోవాలి.

ఇక తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రాసెస్‌ ఫుడ్‌కు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. వీటితో పెరిగే కొవ్వు ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. 

ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించాలనుకునే వారు ఆల్కహాల్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆల్కహాల్‌ ద్వారా లివర్‌ పాడయ్యే అవకాశాలు ఉంటాయి.

నిద్రలేమి సమస్య కూడా మీ ఆయుష్షును తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు అనారోగ్యాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 

ఆయుష్షును తగ్గించడంలో ఒత్తిడి కూడా ఒక కారణమని చెబుతున్నారు. అందుకే యోగా, మెడిటేషన్‌ వంటి వాటిని కచ్చితంగా అలవాటు చేసుకోవాలి. 

ఆహారంలో ఆయిల్‌ తక్కువగా ఉండేలా చూసుకుంటూ.. ఫైబర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉండే ఫుడ్‌ను తీసుకోవాలి. దీనివల్ల మెరుగైన జీర్ణక్రియ సొంతమవుతుంది.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.