మెరిసే చర్మం కావాలంటే ఈ ఫుడ్‌ దూరం పెట్టండి.. 

17 December 2023

మనం తీసుకునే ఆహారం చర్మం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే కొన్ని రకాల పదార్థాలకు దూరంగా ఉంటే చర్మం మెరుస్తుంది.

చక్కెర అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల వయసు మీరే ప్రక్రియ వేగవంతమవుతుంది. షుగర్స్‌ అధికంగా ఉన్న డెజెర్ట్స్‌ను తీసుకోకూడదని చెబుతున్నారు. 

ట్రాన్స్‌ ఫ్యాట్స్‌ అధికంగా ఉండే వేపుళ్లు, జంక్‌ ఫుడ్‌ వల్ల చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను పెంచ‌డ‌మే కాకుండా వృద్ధాప్య ఛాయ‌ల‌కు దారితీసే ఇన్‌ఫ్ల‌మేష‌న్‌ను ప్రేరేపిస్తాయి.

ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మంపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. డీహైడ్రేషన్‌ కారణంగా చర్మం ఆరోగ్యం దెబ్బతింటుంది.

ఇక త్వరగా వృద్ధాప్య ఛాయలు రావడానికి మరో కారణం అధికంగా మద్యం తీసుకోవడం. మద్యం ఎక్కువ తీసుకున్నా డీహైడ్రేషన్‌ సమస్య వెంటాడుతుందని చెబుతున్నారు. 

కెఫీన్‌ ఎక్కువగా ఉండే కాఫీలు తీసుకోవడం వల్ల కూడా వృద్ధాప్య ఛాయలు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 

వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకూడదంటే ప్రాసెస్డ్‌ మాంసానికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫ్యాటీ ఫుడ్‌ వల్ల చర్మంపై ముడతలు వచ్చే అవకాశం ఉంటుంది. 

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు అందించనది మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే మంచిది.