అరటి పండుతో అద్బుతం..!ఇలా వాడితే జుట్టు సంబంధిత సమస్యలన్నింటికీ చెక్‌..

TV9 Telugu

06 February  2024

అరటిపండులో పొటాషియం, సిలికా, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఫైబర్, నేచురల్ ఆయిల్స్‌తో పాటు ప్రొటీన్లు ఉంటాయి. ఈ పోషకాలు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. 

రెండు పండిన అరటిపండ్ల గుజ్జులో పెరుగు మిక్స్‌ చేయాలి. ఈ పేస్ట్‌ను స్కాల్ప్‌కు, జుట్టుకు అప్లై చేసి.. 15 నిమిషాల పాటు ఆరిన తర్వత గోరువెచ్చని నీళ్లతో తలస్నానం చేయండి. 

ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. కుదుళ్లు దృఢంగా మారతాయి. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. పెరుగులోని పోషక విలువలు.. జుట్టును మృదువుగా, పట్టులా ఉంచుతాయి.

అరటిపండు జుట్టుకు చాలా మేలు చేస్తుంది. ఇది దెబ్బతిన్న జుట్టుకు చికిత్స చేస్తుంది.  గుడ్డు, పెరుగు, అరటిపండుతో చేసిన హెయిర్ మాస్క్ జుట్టు రాలడానికి నివారణగా పనిచేస్తుంది. 

అరటిపండు, కొబ్బరి నూనె మాస్క్‌ని తయారు చేసుకుని వాడటం వల్ల పొడి జుట్టుకు మంచి హోం రెమెడీగా పని చేస్తుంది. 

ఈ హెయిర్ మాస్క్‌ను అప్లై చేసిన తర్వాత 20 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత కడిగేయాలి. వారానికి ఒకసారి ఈ మాస్క్‌ను అప్లై చేయడం వల్ల మీ జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

అరటిపండు గుజ్జు, గుడ్డులోని తెల్లసొన, చెంచా నిమ్మరసం కలిపి బాగా మెత్తగా చేయాలి. దీనికి అరకప్పు పెరుగు కలిపి కుదుళ్ల నుంచి చివర్ల వరకూ అప్లై చేయాలి.

అరటిపండులో పొటాషియం, సిలికా, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఫైబర్, నేచురల్ ఆయిల్స్‌తో పాటు ప్రొటీన్లు ఉంటాయి. ఈ పోషకాలు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి.