శ్రావణమాసం ఎప్పటి నుంచి ప్రారంభం..ప్రత్యేకలివే..! 

Jyothi Gadda

01 August 2024

ఆషాఢమాసం అయిపోతోంది..శ్రావణం మొదలైంది.ఈ యేడు శ్రావణమాసం ఎప్పటి నుంచి, వరలక్ష్మీ వ్రతం ఎప్పుడొచ్చిందంటే..

శ్రావణ మాసంలో పౌర్ణమినాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరిసంచడం వల్ల శ్రావణం అనే పేరొచ్చింది.ఈ నెలలో చేసే చిన్నపని కూడా గొప్ప ఫలితాన్నిస్తుంది.

శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతిపాత్రమైన శ్రావణమాసం పూజలు, నోములు, వ్రతాలు, ఉపవాసాలతో నెలమొత్తం భక్తితో నిండిపోతుంది.

ఆషాఢంలో మొదలయ్యే శక్తి పూజకు కొనసాగింపుగా శ్రావణంలో మరో రూపంలో అమ్మను ఆరాధిస్తారు. 

కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరుడి జన్మ నక్షత్రం శ్రవణం..అందుకే ఈ మాసం అత్యంత విశిష్టమైనది అని భావిస్తారు.

ఆగష్టు 9 మొదటి శ్రావణ శుక్రవారం. రెండో శ్రావణ మంగళవారం ఆగష్టు 13 కాగా, రెండో శ్రావణ శుక్రవారం ఆగస్టు16 వరలక్ష్మీ వ్రతం. 

ఈ నెలలో వచ్చే సోమవారాలు పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైమనవి.సాధారణంగా శివయ్యకు సోమవారాలు ప్రత్యేకం.

కార్తీకమాసం, శ్రావణంలో వచ్చే సోమవారాలు మరింత ప్రత్యేకం. ఈనెలలో సోమవారం రోజు రుద్రాభిషేకం, బిల్వార్చన చేస్తే అత్యంత శుభప్రదం