మెంతులు టేస్ట్ లో చేదుగా ఉంటాయి. కానీ వీటిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇవి మన ఆరోగ్యానికే కాకుండా.. జుట్టు, చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి.
మొలకెత్తిన మెంతుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. మొలకెత్తిన మెంతుల్లో ఉండే విటమిన్ సి మన ఇమ్యూనిటీ పవర్‌ను బాగా పెంచుతుంది.
మెంతులతో చేసిన మొలకలను ఉదయాన్నే తింటే మీ రోగనిరోధక శక్తి బలపడి మీరు అనేక రకాలైన అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులు, ఇతర రోగాలకు దూరంగా ఉంటారు.
మొలకెత్తిన మెంతుల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటిని మీ రోజువారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్దకం సమస్య కూడా తగ్గిపోతుంది.
మొలకెత్తిన మెంతులను తింటే గుండెల్లో మంట, అసిడిటీ లు కూడా తగ్గిపోతాయి. భోజనానికి ముందు మొలకెత్తిన మెంతులను తింటే గుండెల్లో మంట రాదు. జీర్ణ సమస్యలకు చెక్ పెడుతుంది.
డయాబెటీస్ పేషెంట్లకు మొలకెత్తిన మెంతులు మంచిది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న మెంతులు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడతాయి. గుండె ఆరోగ్యానికి మంచిది.
కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉండే మొలకెత్తిన మొలకలను తినడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. మెంతుల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. వీటిని తింటే రక్తహీనత తగ్గుతుంది.
మొలకెత్తిన మెంతుల్లో కేలరీలు చాలా తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఆకలి చాలా వరకు తగ్గుతుంది. దీంతో బరువు తగ్గుతారు. ఈ మొలకలు బెల్లీ ఫ్యాట్ ను తగ్గిస్తుంది.
ఈ మొలకల్లో ఎన్నో రకాల పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉండే మొలకెత్తిన మెంతులను తినడం వల్ల మీ చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి.