పాలకూర సూపర్ ఫుడ్‌.. అయినా వీరికి మాత్రమే విషంతో సమానం.. 

21 September 2024

TV9 Telugu

Pic credit -  Pexels

శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగితే కీళ్లలో నొప్పి మొదలవుతుంది. గౌటీ ఆర్థరైటిస్ అంటారు. యూరిక్ యాసిడ్ ని నియంత్రించుకోకపోతే కిడ్నీ సమస్యలు కూడా మొదలవుతాయి.

యూరిక్ యాసిడ్ సమస్య

యూరిక్ యాసిడ్ సమస్యని కొన్ని కూరగాయలు పెంచుతాయి. వాటిల్లో ఒకటి పాలకూర. విటమిన్ ఎ, ఐరన్ సమృద్ధిగా ఉండే పాలకూరని యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు తక్కువగా తినవలసి ఉంటుంది. 

పాలకూరలో 

సీనియర్ డైటీషియన్ పాయల్ శర్మ మాట్లాడుతూ పాలకూరలో పొటాషియం, ఫైబర్‌తో పాటు, అధిక మొత్తంలో ప్యూరిన్ కూడా ఉంటుంది. కనుక యూరిక్ యాసిడ్ పెరిగితే తక్కువ తినండి.

డైటీషియన్ ఏమన్నారంటే 

పీచు పదార్థాలు ఎక్కువ తీసుకుంటే మలబద్ధకం, గ్యాస్, కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. కనుక పాలకూరను పరిమితంగా మాత్రమే తినండి.

ఫైబర్ ఎక్కువ  

పాల కూలోని ఆక్సలేట్ కారణంగా కిడ్నీకి సంబంధించిన ఆరోగ్య సమస్యలు వస్తాయి. యూరిన్ ద్వారా విసర్జితమయ్యే ఆక్సలేట్ రాళ్లుగా మారవచ్చు. కిడ్నీల పనితీరు కూడా దెబ్బతింటుంది.

 కిడ్నీ సమస్య

రక్తం పలుచబడెందుకు మందులు వాడే వారు పాలకూర తినొద్దు. దీనిలో విటమిన్ K ను కలిగి ఉంటుంది. ప్రత్యేకించి గుండెపోటు రోగులకు ఇచ్చే బ్లడ్ థిన్నర్ మందుల ప్రభావాన్ని తగ్గించేస్తుంది. దీంతో ప్రమాదం కావచ్చు.  

బ్లడ్‌ థిన్నర్‌ డ్రగ్స్‌

యూరిక్ యాసిడ్ పదే పదే పెరిగితే ఆరోగ్య నిపుణుడితో మాట్లాడి డైట్ ని అనుసరించాలి. రోజంతా ఎక్కువ నీరు త్రాగండి. అధిక ప్రోటీన్ ఆహారం తీసుకోకుండా ఉండండి.

యూరిక్ యాసిడ్ బాధితులు