ఉప్పాడ జమ్‌దానీ చీరల ప్రత్యేకత తెలుసా?

TV9 Telugu

20 January 2024

కళా నైపుణ్యానికి పెట్టింది పేరు జమ్‌దానీ చీరలు, జామ్ దానీ చీరలు కావాలంటే తూర్పు గోదావరి కొత్తపల్లి మండలం ఉప్పాడ వెళ్లాల్సిందే....

ఉప్పాడలో చేనేత కార్మికులు డిజైన్ చేసి విక్రయించే జమ్ దానీ చీరలకు దాదాపు మూడు వందల సంవత్సరాల చరిత్ర ఉంది.

ప్రపంచ ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్లను సైతం ఆకర్షించిన జమ్ దారీ చీర ఒరిజినల్ డిజైనర్లకు.. 1972లోనే భారత ప్రభుత్వం రాష్ట్రపతి అవార్డుతో సత్కరించారు.

స్వచ్ఛమైన కాటన్‌తో తయారుచేసే జమ్ దానీ చీరలపై పూల డిజైన్లు చాలా వైవిధ్యమైన రీతిలో ఉంటాయి. జమ్‌దానీ బంగ్లాదేశ్‌కు చెందిన ఈ అపురూప కళ.

జమ్‌దానీ అనేది పర్షియన్ పదం. "జామ్" అంటే పువ్వు అని అర్థం. ఈ సంప్రదాయ నేత కళతో నేసిన ఈ చీరలను యునెస్కో సైతం పురాతన సాంస్కృతిక సంపదగా గుర్తించింది.

జమ్ దానీ చీరలను మగ్గం పై తయారుచేసే వ్యక్తి అత్యంత నేర్పరి అయ్యుండాలి. ఎందుకంటే డిజైన్‌ను చేతితో వేయాలి కాబట్టి.. చాలా సమయం తీసుకుంటుంది.

ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో ఉప్పాడలో జమ్ దానీ చీరలను నేసే కుటుంబాలు దాదాపు 3వేలకు పైగా ఉండడం విశేషం.

మరొక సంగతేంటంటే.. కంచీ, ధర్మవరం చీరలతో పోల్చుకుంటే ఈ ఉప్పాడ జమ్ దానీ చీరలు చాలా తక్కువ బరువు ఉంటాయి.