ఈ సాంప్రదాయ పానీయాలతో సమ్మర్ అంతా హ్యాపీ హ్యాపీ..

TV9 Telugu

24 May 2024

పంజాబ్ నుంచి ఉద్భవించిన లస్సీని పెరుగు, చిటికెడు చక్కెరతో తయారుచేస్తారు. వేసవిలో లస్సీ ప్రతి సిప్ ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది.

సంబరం అనేది పెరుగుతో చేసిన కేరళ సాంప్రదాయ పానీయం. పెరుగు మరియు అల్లంతో చేసిన సాధారణ మజ్జిగ. కేరళ వెళ్తే తప్పక ప్రయత్నించాలి.

ఫలూడా అనేది రోజ్ సిరప్, స్వీట్ బాసిల్, వెర్మిసెల్లి, ఐస్ క్రీం ఉపయోగించి తయారు చేయబడిన ఒక ప్రసిద్ధ మొఘలాయి పానీయం.

జిగర్తాండ అనేది ఆల్మండ్ గమ్, పాలు, రూట్ సిరప్, ఐస్ క్రీంతో తయారు చేయబడిన ఒక సాంప్రదాయ తమిళనాడు పానీయం.

తండై ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ పానీయం. ఇది వేసవిలో డిహైడ్రేట్ అవకుండా కాపాడుతుంది.

నన్నారి షెర్బెత్ అనేది నన్నారి రూట్స్ (సర్సపరిల్లా), చక్కెర, నిమ్మకాయలు, నీటితో తయారు చేయబడిన విలక్షణమైన కేరళ షెర్బెత్.

రోజ్ మిల్క్ ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రికి చెందిన రుచిగల పానీయం. తెలుగు వారు ఏడాది పొడవునా వేసవిలో కూడా దీన్ని తాగడానికి ఇష్టపడతారు.

చెరుకు రసం వేసవికాలంలో వేడిని తట్టుకోవడానికి భారతీయులు ఈ పానీయాన్ని చాలామంది ఎక్కువగా ఇష్టంగా తాగుతారు.