వేసవిలో కూడ మీ ఇంటిని చల్లగా ఉంచుకోండిలా..
TV9 Telugu
06 April 2024
వేసవి వచ్చిందంటే చాలు ఎండలతో బయటికి వెల్లడికి కష్టంగా మారుతుంది. ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఇంట్లో కూడా వేడి పెరిగింది.
ఎండాకాలం మొదలైందంటే చాలు పెరిగిన ఉష్ణోగ్రతలతో చిన్నా పెద్దా అందరూ కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
అలాంటివారు ఇంటిని నేచురల్‌గానే చల్లగా ఉంచుకోవాలనుకుంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అవేంటో తెలుసుకోండి.
చూడ్డానికి చాపల్లా ఉండే ఖస్ ఖస్ కర్టెన్స్ వాడితే ఇంట్లోకి వేడి రాకుండా చేసుకోవచ్చు. కిటికీలు, బాల్కనీలు, గుమ్మాలకి వీటిని వాడొచ్చు
వీటిపై కొంచెం నీటిని స్ప్రే చేస్తే మరింత చల్లగా ఉంటాయి. వీటి వల్ల ఇంటి బయట, లోపల ఉష్ణోగ్రతలు చల్లగా మారుతుంది.
డాబా పై వేడిని తగ్గించేందుకు బకెట్లలో నీటిని చల్లండి.. అదే విధంగా, తడిచిన బెడ్‌షీట్స్‌ని నేలపై వేయండి.
ఇల్లు, ఇంటి చుట్టూ కూడా నీటిని చల్లండి. దీని వల్ల మట్టి దగ్గర ఉంటే మంచి వాసన రావడమే కాకుండా గాలి కూడా చల్లబడుతుంది.
తాగడానికి కూల్ డ్రింక్స్ కాకుండా మజ్జిగ ఇంకా పుచ్చకాయ, దోసకాయలు, మామిడిపండ్లతో డ్రింక్స్ ఇంట్లో చేసి తీసుకోవచ్చు. వీటి వల్ల దాహం తీరుతుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి