ఏపీలో తారుమారు సంత.. ఇది సంక్రాంతి స్పెషల్

TV9 Telugu

12 January 2024

ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు.. వారం ముందు నుంచే ఏజెన్సీ ప్రాంతంలో సందడి వాతావరణం మొదలవుతుంది.

ఈ తారుమారు సంత అల్లూరి ఏజెన్సీ జి.మాడుగులలో జరుగుతుంది. ఏటా సంక్రాంతికి ముందు వచ్చే మంగళవారం నిర్వహిస్తారు.

గిరిజనులు పండించిన పంటలను సంతకు తీసుకువచ్చి అమ్మకాలు జరిపి.. పండక్కి కావలసిన సామాగ్రిని కొనుగోలు చేస్తారు.

వేర్వేరు ప్రాంతాలకు చెందిన గిరిజనులంతా ఒక చోట చేరి సరదాగా గడుపుతారు. పండక్కి రావాలని బంధువులను ఆహ్వానిస్తారు.

తారుమారు సంతకు తరలివచ్చిన అన్ని ప్రాంతాల గిరిజనులు తమ బంధువులు, స్నేహితులను పిల్లలతో పరిచయం చేసుకుంటారు.

యుక్త వయసు వచ్చే పిల్లల పెద్దలు వారి బంధుత్వాల కోసం మాట్లాడుకుంటారు. పెళ్లి సంబంధాలనూ కుదుర్చుకుంటారు.

ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన అనేక మంది గిరిజనులు ఈ ప్రముఖ తారుమారు సంతకు ప్రతి సంవత్సరం హాజరవుతుంటారు.

ఈసారి పంటలు అంతగా పండకపోవడంతో తారుమారు సంతలో సందడి బాగా తగ్గిందని అంటున్నారు అక్కడ పని చేస్తున్న వ్యాపారులు.